Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 29 July 2019

కందుకూరులో కామకలాపాలు.. వ్యభిచార ముఠా ఆటకట్టు

కందుకూరులో ఏళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న వ్యభిచార ముఠా దందాకు పోలీసులు ఎట్టకేలకు చెక్ పెట్టారు. నివాసాల మధ్య గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచార కార్యకలాపాలపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శనివారం రైడ్ చేసి ఐదుగురు యువతులు, ముగ్గురు విటులను అరెస్ట్ చేశారు. అయితే వ్యభిచార నిర్వాహకులు పట్టణంలో పలుకుబడి ఉన్నవారు కావడంతో నిందితులను మీడియా కంట పడకుండా గుట్టుచప్పుడు కాకుండా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వీరిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించారు. కొద్దిరోజులుగా కోవూరు రోడ్డులోని ఓ భవనంలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతోందని, కొందరు బ్రోకర్లు ఒంగోలు, నెల్లూరు, విజయవాడ, గూడూరు, రాజమహేంద్రవరం నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. పట్టణంలోని కోవూరు రోడ్ , విక్కిరాలపేట రోడ్, పామూరు రోడ్, పలుకూరు అడ్డరోడ్డులో నిర్మానుష్య ప్రాంతాలను ఎంచుకుని విటులను ఆకర్షిస్తున్నారని, పోలీసుల నిఘా లేకపోవడంతో వ్యభిచార నిర్వాహకులు రెచ్చిపోతున్నారని చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో రాత్రి 9గంటలు దాటితే ఫ్యామిలీతో వెళ్లాలంటే భయమేస్తోందని, ఆడవాళ్లతో వెళ్తుంటే మందుబాబులు, విటులు వాహనాలు ఆపి వేధింపులకు గురిచేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు రాత్రి సమయాల్లో గస్తీ పెంచి వ్యభిచార కార్యకలాపాలను నియంత్రించాలని కోరుతున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2ZhAMRe

No comments:

Post a Comment