
ఆంధ్రప్రదేశ్ ఛైర్మన్‌గా యువ ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అవకాశం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా రజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను ఛైర్మన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజా కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవిలో రెండేళ్లు కొనసాగనున్నారు. త్వరలోనే రాజా బాధ్యతలు స్వీకరించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా రజానగరం నుంచి తొలిసారి ఎమ్యెల్యేగా గెలిచారు. కాపు సామాజిక వర్గానికి చెందిన యువనేత కావడంతో.. ఆయనకు జగన్ ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. రాజా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా పని చేశారు. తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైసీపీలో చేరారు. 2011లో ఆయన మరణించారు. 2014 ఎన్నికల్లో రామ్మోహన్ సతీమణి విజయలక్ష్మి వైసీపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2019లో రాజా పోటీచేయగా.. ఘన విజయం సాధించారు. జక్కంపూడి కుటుంబం మొదటి నుంచి వైఎస్‌కు అత్యంత నమ్మకంగా ఉంది. రాజా తండ్రి రామ్మోహన్ వైఎస్‌కు సన్నిహితంగా మెలిగారు. తూర్పుగోదావరి జిల్లాలో కీలక నేతగా ఉన్నారు. అయితే రాజాకు మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తారనే ప్రచారం జరిగింది. సామాజిక సమీకరణాలు, సీనియార్టీతో అవకాశం దక్కలేదు.. కానీ ఇప్పుడు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి దక్కింది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2JYC6TU
No comments:
Post a Comment