
మక్తల్ చిట్టెం రామ్మోహన్ రెడ్డికి విచిత్రమైన అనుభవం ఎదురయ్యింది. పెరిగిన పెన్షన్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ సందర్భంగా కార్యకర్త ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగాడు. ఒక దశలో ఎమ్మెల్యే సహనం కోల్పోగా, బీజేపీ కార్యకర్త సైతం అంతే ఆవేశంతో ఊగిపోయాడు. బీజేపీవాళ్లు, నరేంద్రమోదీ తనను ఏమీ చేయలేడని ఎమ్మెల్యే అంటే, మీరు కూడా మమ్మల్ని ఏమీ పీకలేరంటూ సవాల్ విసిరాడు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త వాతవరణం నెలకుంది. నిదానంగా చూడండి సార్ అంటూ బీజేపీ కార్యకర్త సలహా ఇవ్వడంతో నువ్వు నాకు చెప్పడమేంటి.. మర్యాదగా మాట్లాడం నేర్చుకోమని ఎమ్మెల్యే అన్నారు. బీజేపీ కార్యకర్త.. నేను చాలా మర్యాదగా మాట్లాడుతున్నానని... మీరు చాలా మర్యాదగా మాట్లాడే విషయం లైవ్‌లో చూశామని అనగానే, బీజేపీవోడు, నరేంద్ర మోదీ ఏం పీకలేరని ఎమ్మెల్యే చిట్టెం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన బీజేపీ కార్యకర్త.. నన్ను టీఆర్ఎస్సోడు ఏం పీకలేరు.. సవాల్ విసురుతున్నా అంటూ ఎదురుదాడి చేయడం విశేషం. బీజేపీ అనలేదని, నరేంద్ర మోదీని అంటున్నానని ఎమ్మెల్యే చిట్టెం అన్నారు. అధికార దాహం చూపిస్తున్నారా... అధికారం కొన్ని రోజులే అంటూ ప్రశ్నించాడు. ఎమ్మెల్యే సైతం అతడిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడున్నవారు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. బీజేపీ కార్యకర్తను అక్కడ నుంచి పంపించేశారు. ఈ ఘటన మక్తల్ మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ సోదరుడైన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లో చేరారు. ఇక, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/32ZoJdl
No comments:
Post a Comment