Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Thursday, 15 August 2019

విజయవాడలో గ్యాంగ్‌రేప్.. ఫ్రెండ్స్‌తో కలిసి ఆటోడ్రైవర్ అఘాయిత్యం

భర్త వదిలేయడంతో తల్లితో కలిసి ఉంటున్న మహిళపై కన్నేశాడో ఆటోడ్రైవర్. షాపునకు రోజూ అతడి ఆటోలోనే వెళ్తుండటంతో ఆమెతో చనువు పెంచుకున్నాడు. ఓ రోజు దారి మరల్చి నలుగు ఫ్రెండ్స్‌తో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. వాంబేకాలనీకి చెందిన యువతి (23)ని భర్త వదిలేయడంతో తల్లితో కలిసి ఉంటోంది. రింగ్‌రోడ్డులో సమోసాలు తయారు చేసే ఓ కంపెనీలో పనిచేస్తోంది. రోజూ సర్వీసు ఆటో ఎక్కి పనికి వెళ్తుండేది. ఈ నేపథ్యంలో ఆటోడ్రైవర్‌ వెంకటేష్‌ అలియాస్‌ వెంకీతో పరిచయం ఏర్పడింది. దీంతో రోజూ అతని ఆటోలోనే పనికి వెళ్లేది. మంగళవారం ఉదయం కంపెనీకి వెళ్లేందుకు ఆమె లెనిన్‌సెంటరుకు రాగా కొంచెం మాట్లాడాలని వెంకీ ఆమెను బందరు బీచ్‌కు ఆటోలో తీసుకెళ్లాడు. అక్కడ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తన కోరిక తీర్చాలని కోరాడు. దీనికి ఆమె నిరాకరించడంతో నిర్బంధించి తన నలుగురు ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి రప్పించాడు. వారంతా కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలికి సుమారు 8 గంటల పాటు నరకం చూపారు. తనను వదిలిపెట్టాలని ఆమె వేడుకున్నా కామాంధులు కనికరించలేదు. ఎట్టకేలకు మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో బాధితురాలు వారి బారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. కుమార్తె శరీరంపై గాయాలు చూసిన తల్లి ఏం జరిగిందని అడగగా ఆటోలో నుంచి పడిపోయానని చెప్పింది. బుధవారం ఉదయం లేచేసరికి కుమార్తె ఒళ్లు వేడిగా కాలిపోతుండటంతో ఏం జరిగిందో చెప్పాలని తల్లి నిలదీసింది. దీంతో తనపై జరిగిన అఘాయిత్యాన్ని తల్లికి చెప్పింది. దీంతో ఆమె ఐద్వా మహిళా నేతలను ఆశ్రయించడంతో వారు బాధితురాలిని నున్న పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించారు. పోలీసుల తీరుపై విమర్శలుబాధితురాలు ముందుగా గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా వారు తమ పరిధి కాదంటూ చెప్పడంతో ఆమెతో పాటు వచ్చిన మహిళా నేతలు కంగుతిన్నారు. ఈ విషయాన్ని సీపీఎం నేత సీహెచ్ బాబూరావు పోలీసు ఉన్నతాధికారులకు చెప్పడంతో నున్న నుంచి మహిళా రైటర్‌ను గవర్నర్‌పేట పీఎస్‌కు పంపించి కేసు నమోదు చేశారు. అనంతరం బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయంలోపై పోలీసుల తీరుపై పలువురు మండిపడుతున్నారు. నిందితుల కోసం గాలింపు ఈ కేసులో నిందితుల కోసం విజయవాడ పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రధాన నిందితుడైన వెంకటేష్ పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకుంటే కేసులో మరిన్ని కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. రాజీవ్‌నగర్‌లోకి వెంకటేష్ ఇంటికి వెళ్లిన పోలీసులు అతడి కుటుంబసభ్యులను విచారించారు. అయితే వెంకటేష్ ఎక్కడికి వెళ్లాడో తమకు తెలీదని కుటుంబసభ్యులు చెప్పడంతో వారి కాల్‌డేటాపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2YTitFJ

No comments:

Post a Comment