బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బైక్‌పై వెళ్తున్న రెండు నెలల గర్భిణి అయిన 19 ఏళ్ల ఓ యువతిని అడ్డగించి ఐదుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా చేశారు. రాజస్థాన్‌లోని బన్స్‌వారా జిల్లాలో నెల కిందట జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ఆత్మహత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఈ అఘాయిత్యం గురించి తెలిసింది. మానవ మృగాలు జరిపిన అఘాయిత్యం వల్ల బాధితురాలు.. ప్రియుడి కారణంగా దాల్చిన 8 వారాల పిండాన్ని కోల్పోవడమే కాకుండా, ప్రాణాపాయ స్థితిలోకి జారుకుంది. బాయ్‌ఫ్రెండ్‌పై దాడి చేసి దళిత యువతిని సామూహిక అత్యాచారం చేసిన ఐదుగురు నిందితులను పోలీసులు సోమవారం (ఆగస్టు 12) అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. దళిత కుటుంబానికి చెందిన 19 ఏళ్ల ఓ యువతి.. ఓ యువకుడు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రియుడి కారణంగా ఆమె గర్భం కూడా దాల్చింది. జులై 13న రాత్రి 10 గంటల సమయంలో వీరిద్దరూ బన్స్‌వారా పట్టణం నుంచి తమ సొంత గ్రామానికి బైక్‌పై బయల్దేరారు. మార్గమధ్యలో వీరిని ముగ్గురు దుండగులు అడ్డగించారు. Read Also: మద్యం మత్తులో ఉన్న మృగాళ్లు.. ప్రియుడిని చితకబాది అతడి వద్ద ఉన్న మొబైల్, ఇతర వస్తువులను లాక్కున్నారు. అనంతరం ఆ యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను నిందితుల్లో ఒకడైన సునీల్ అనే యువకుడి గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ మరో ఇద్దరు యువకులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. జులై 13 రాత్రంతా యువతిపై కిరాతక పర్వం జరిపిన మృగాళ్లు.. 14న వేకువజామున 4 గంటల సమయంలో ఆమెను ఓ ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయారు. అయితే.. తన కళ్ల ముందే తన ప్రియురాలు కామాంధుల చేతిలో అత్యాచారానికి గురవుతుంటే కాపాడుకోలేకపోయాననే అవమాన భారంతో ప్రియుడు అప్పటికే ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. మిస్టరీగా ఆత్మహత్య.. విచారించగా అసలు గుట్టురట్టు అఘాయిత్యం జరిగిన తర్వాత సొంతూరుకు వెళ్లిన బాధితురాలి ప్రియుడు.. అదే రోజు అర్ధరాత్రి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడు ఉన్నపళంగా ఆత్మహత్య చేసుకోవడం గ్రామంలో మిస్టరీగా మారింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. గర్భిణిని అత్యాచారం చేసిన వారిలో జితేంద్ర, సునీల్, వికాస్, నరేశ్, విజయ్ ఉన్నారు. బాధితురాలి ప్రియుడి వద్ద ఫోన్ లాక్కున్న జితేంద్ర.. ఆ తర్వాత ఆ ఫోన్‌ను తన భార్యకు ఇచ్చాడు. ఆమె ఫోన్ స్విచ్ఛాన్ చేయడంతో.. ఆ సిగ్నళ్ల ఆధారంగా పోలీసులు లొకేషన్‌ను గుర్తించి విచారించారు. ఆ తర్వాత జితేంద్రను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. యువకుడి ఆత్మహత్యతో జితేంద్రకు ఏమిటి సంబంధం అనే కోణంలో విచారించగా.. షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. తన ప్రియురాలు కామాంధుల చేతిలో అత్యాచారానికి గురైన ఘటనను జీర్ణించుకోలేని యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. అతడి ఫోన్ కాల్స్ డేటా పరిశీలించగా.. ఘటన జరిగిన రోజు బాధిత యువతి పలుమార్లు అతడికి ఫోన్ చేసినట్లు తేలింది. ఆ నంబర్‌ను సంప్రదించి యువతి వద్దకు వెళ్లి మరిన్ని విషయాల గురించి ఆరా తీశారు. కామాంధుల చేతిలో అత్యాచారానికి గురవడంతో బాధితురాలు తన కడుపులో పెరుగుతున్న 8 వారాల పిండాన్ని కోల్పోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అంత బాధలోనూ తన కుటుంబ పరువు పోతుందని ఆమె తనపై జరిగిన అఘాయిత్యం గురించి బయట పెట్టలేదు. చివరికి పోలీసులకు జరిగిన విషయం గురించి చెప్పింది. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న పోలీసులు.. ఐదురుగు నిందితులను అరెస్టు చేశారు. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి వారిని కోర్టులో జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2H6dmqK
No comments:
Post a Comment