Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 13 August 2019

తల్లిదండ్రుల ముందే నాలుగేళ్ల అమ్మాయితో మాయం.. సికింద్రాబాద్‌లో దారుణం

ల్లిదండ్రులను తప్పుదోవ పట్టించి సికింద్రాబాద్‌లో ఓ దుండగుడు నాలుగేళ్ల పాపను సినీ ఫక్కీలో కిడ్నాప్ చేశాడు. జ్వరంతో బాధ పడుతున్న చిన్నారులకు చికిత్స అందించడానికి ఆస్పత్రి తీసుకెళ్తున్న పేద దంపతులను సాయం పేరుతో మోసం చేశాడు. కళ్ల ముందే పాప కనిపించకుండాపోవడంతో ఆ దంపతులు కన్నీరు మున్నీరవుతున్నారు. సికింద్రాబాద్‌లోని రామ్ గోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం (ఆగస్టు 12) చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. రామ్ గోపాల్ పేటలో నివాసం ఉండే రాజు, హాజిరా దంపతులకు ముగ్గురు పిల్లలు సంతానం. పెద్ద కుమార్తె ఫాతిమా (4), కుమారుడు రమేష్ (3), 3 నెలల చిన్నారి మౌనిక ఉన్నారు. మౌనిక రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఆ చిన్నారిని నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లడానికి దంపతులిద్దరూ తమ ముగ్గురు పిల్లలను తీసుకొని బయలుదేరారు. ప్యాట్నీ వద్ద బస్సు దిగిన రాజు, హాజిరా దంపతులు తమ పిల్లలను ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని ఓ వ్యక్తి బాగున్నావా అంటూ రాజును పలకరించాడు. ఫంక్షన్ హాల్‌లో పని చేసే రాజు.. అతడు తనకు ఎప్పుడో పరిచయం ఉన్న వ్యక్తి కాబోలు అనుకొని మాటలు కలిపాడు. మాట్లాడుకుంటూ కొంత దూరం నడిచిన తర్వాత ముగ్గురు పిల్లలను ఎలా మోస్తావు అంటూ ఆ దుండగుడు రాజు వద్ద ఉన్న బ్యాగుతో పాటు ఫాతిమాను ఎత్తుకున్నాడు. కాస్త దూరం వెళ్లిన తర్వాత ఫాతిమా ఆకలిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పాలు కొనుగోలు చేయడానికి ఓ హోటల్‌లోకి వెళ్లారు. హోటల్ లోనికి వెళ్లొచ్చేసరికి పాపతో మాయం పాపను ఎత్తుకొని తాను బయటే ఉంటానని చెప్పిన ఆ దుండగుడు పాలు తీసుకొని రమ్మని ఆ పేద దంపతులను పురమాయించాడు. అతడి మాటలు నమ్మి వాళ్లు హోటల్‌ లోనికి వెళ్లి వచ్చారు. బయటకి వచ్చి చూసే సరికి పాపతో పాటు ఆ వ్యక్తి కనిపించకపోవడంతో వారి గుండె జారిపోయింది. నిమిషాల వ్యవధిలో అతడు తమ పాపను తీసుకొని పారిపోవడంతో దంపతులు షాక్ తిన్నారు. పాప కోసం పరిసర ప్రాంతాల్లో గాలించగా.. ఎక్కడా ఆచూకీ లభించలేదు. దీంతో సోమవారం రాత్రి రామ్ గోపాల్ పేట పోలీసులను ఆశ్రయించారు. దంపతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ కెమెరాల్లో ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. చిన్నారిని ఎత్తుకొని ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. పాప గురించి ఎలాంటి వివరాలు తెలిసినా తమకు సమాచారం అందించాలని సూచించారు. 24 గంటలు గడుస్తున్నా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో ఆ తల్లిదండ్రులు రోదిస్తున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/31zUIzt

No comments:

Post a Comment