విషయం ఆర్టికల్ 370 రద్దు చేయడంతో జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికున్న ప్రత్యేక అధికారాలు రద్దయ్యాయి. రాష్ట్ర ప్రజలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని వారికి ఆర్టికల్ రద్దు ఇష్టంలేదని భిన్న వాదనలు వినిపించాయి. ఈ క్రమంలో ఆగస్టు 10న అధికారిక ట్విట్టర్‌లో ‘జమ్మూలో పరిస్థితి మామూలు స్థితికి వచ్చేసిందని’ పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. బిహార్ జమ్మూకాశ్మీర్ పోలీసులకు బిహార్ రిజిష్ట్రేషన్ వావానాలు కూడా ఇస్తున్నారా అని సెటైర్లు వేసి నిజమేంటని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ కోడ్‌తో మొదలయ్యే నెంబర్ ప్లేట్ వాహనాలను జమ్మూకాశ్మీర్ పోలీసులకు ఇవ్వడం ఎప్పుడు మొదలుపెట్టారని మరో నెటిజన్ వ్యంగ్యాస్త్రం. కొందరు మొబైల్స్ వాడుతున్నట్లు కనిపిస్తోంది. అంటే అక్కడ నిషేధం ఎత్తివేశారా మరో నెటిజన్ సందేహాన్ని వెలిబుచ్చాడు. టైమ్స్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ పోలీసులు, నెటిజన్ల ట్వీట్లలో నిజమేంటో చెప్పాలని అన్ని విషయాలను పరిశీలనకు తీసుకుంది. నిజం జమ్మూకాశ్మీర్ పోలీసులు షేర్ చేసిన ఫొటోలు జమ్మూ ప్రాంతానికి చెందినవే. పరిశీలన 1. నెంబర్ ప్లేట్లు పోలీసులు పోస్ట్ చేసిన మూడో ఫొటోలో ఎస్‌యూవీ వాహనం రిజిస్ట్రేషన్ బీఆర్ అని ఉండగా, బైక్ జేఅండ్‌కే అని నెంబర్ ప్లేట్‌పై రాసి ఉంది. ఓ రాష్ట్రానికి చెందిన వాహనాలు మరో రాష్ట్రంలో నడపరాదన్న నిబంధనలు లేవని, కొంత మేర ట్యాక్స్ చెల్లించి వాహనాలు వేరే రాష్ట్రానికి తీసుకెళ్లవచ్చునని తెలిసిందే. 2. ఎస్‌బీఐ బ్రాంచ్ గూగుల్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్ టూల్ ఇన్ విడ్ మ్యాగ్నిఫయర్ టూల్ సాయంతో ఈ ఫొటోను పరిశీలించారు. హిందీ క అని, ఇంగ్లీష్ అక్షరాలు NDIAఅని, రియాసి అని హిందీ మరియు ఇంగ్లీషు భాషల్లో రాసి ఉంది. ఎస్‌బీఐ బ్రాండ్ సింబల్ రెండింట్లోనూ ఒకేలా ఉంది. రియాసి(Reasi)లో స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ ఉందని గూగుల్‌లో చూస్తే తెలుస్తుంది. 3. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రియాసి ఇన్‌విడ్ మ్యాగ్నిఫయర్ టూల్ సాయంతో గమనిస్తే.. బస్టాండ్ సమీపంలో ప్రభుత్వ మాధ్యమిక ఉన్నత పాఠశాల కనిపిస్తోంది. రియాసి.ఎన్‌ఐసీ.ఇన్ వెబ్‌సైట్ చెక్ చేస్తే రియాసి బస్టాండ్ సమీపంలో గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఉన్నట్లు స్పష్టమవుతుంది. 4. ఫోన్ల వాడకం కొందరు ప్రజలు ఫోన్లు వాడుతున్నాని, అందుకే ఆ ఫొటో జమ్మూ ప్రాంతానిది కాదని కామెంట్ చేశారని తెలిసిందే. జర్నలిస్ట్ పూజా షాలి చేసిన ట్వీట్ గమనించాలి. ‘ఈ ఫొటో జమ్మూ డివిజన్‌లోని రియాసి జిల్లాలో తీశారు. మార్కెట్ సజావుగా సాగుతోంది. ఫోన్లు కూడా పనిచేస్తున్నాయి. నేను ఇక్కడి నుంచి వెళ్లాను. ఇది సరైన ఫొటోనే’ అని ట్వీట్లో పేర్కొన్నారు. ‘ఇండియా టుడే’లోనూ షాలి చెప్పిన విషయాలను రిపోర్ట్ చేశారు. నిర్ధారణజమ్మూకాశ్మీర్ పోలీస్ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు జమ్మూ ప్రాంతానికి చెందినవని, అక్కడ ప్రస్తుత వాతావరణం సాధారణంగా ఉందని టైమ్స్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ గుర్తించి వివరాలు వెల్లడించింది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2yUMbuF
No comments:
Post a Comment