
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని లేడీస్ హాస్టల్‌లోకి అర్ధరాత్రి ఓ ఆగంతకుడు ప్రవేశించి అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడం కలకలం రేపింది. ఇంజినీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్‌లోకి గురువారం (ఆగస్టు 15) తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి చొరబడ్డాడు. ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. ఆమెను కత్తితో బెదిరించాడు. ఓయూ పోలీసులు, వర్సిటీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఇంజినీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్ వెనుక వైపు నుంచి ఆగంతుకుడు చొరబడడ్డాడు. అదే సమయంలో ఓ విద్యార్థిని బాత్‌రూమ్‌కి వెళ్లింది. అది గమనించిన దుండగుడు బాత్‌రూమ్ డోర్‌కు బయట నుంచి గడియ పెట్టి పైనుంచి బాత్‌రూం లోపలికి ప్రవేశించాడు. అమ్మాయికి కత్తి చూపించి బెదిరించాడు. బాత్‌రూమ్‌లో విద్యార్థినితో ఆగంతుకుడు అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో మిగిలిన విద్యార్థులు అక్కడికి పరుగెత్తుకొచ్చారు. అది గమనించిన దుండగుడు అమ్మాయి సెల్‌ఫోన్ లాక్కొని వచ్చిన దారి వెంటే పారిపోయాడు. గురువారం ఉదయం హాస్టల్ భవనం వెనుక వైపు ప్రహరీ వద్ద బాధితురాలి సెల్‌ఫోన్‌ను పోలీసులు గుర్తించారు. విద్యార్థిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా తెలిసిన వ్యక్తే దురుద్దేశంతో హాస్టల్‌లో ప్రవేశించాడా అనే కోణంలోనూ విచారిస్తున్నారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2KCCKH2
No comments:
Post a Comment