హైదరాబాద్ ఘటన నిజంగా సిగ్గుచేటు: కోహ్లి ఆవేదన

శివారులో యువ వెటర్నరీ డాక్టర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడి, దారుణంగా చంపేసిన ఘటనపై టీమిండియా కెప్టెన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది చాలా సిగ్గు పడాల్సిన విషయమని అంటూ ట్వీట్ చేశాడు. ‘హైదరాబాద్‌లో జరిగిన ఘటన నిజంగా సిగ్గుచేటు. మనమందరం సమాజంపై బాధ్యత తీసుకుని ఇలాంటి దారుణాలకు స్వస్తి పలకాలి’ అంటూ కోహ్లి ట్వీట్‌లో పేర్కొన్నాడు. కోహ్లితో పాటు శిఖర్ ధావన్, ఓజా, అమిత్ మిశ్రా సైతం ఈ ఘటనను ఖండిస్తూ ట్వీట్లు చేశారు. Also Read: వెటర్నరీ డాక్టర్ అయిన యువతిని నలుగురు కామాంధులు దారుణంగా అత్యాచారానికి పాల్పడి, చంపి దహనం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా.. 14రోజుల రిమాండ్ విధించారు. దీంతో వారిని చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే నిందితులను తమకు అప్పగించాలంటూ ప్రజలు శనివారం షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. వారిని బహిరంగంగా ఉరి తీయాలని, పోలీసులకు చేతకాకపోతే నిందితులను తమకు అప్పగించాలని, తామే వారికి తగిన శిక్ష విధిస్తామని ప్రజలు హెచ్చరించారు. Also Read: Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/37Pnf81

Post a Comment

0 Comments