దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్ శివారులో వెటర్నరీ డాక్టర్ గ్యాంగ్ రేప్ హత్య, హన్మకొండలో పుట్టినరోజే యువతిపై అత్యాచారం, హత్య ఘటనలపై ఓ పక్క ఆందోళనలు జరుగుతూనే ఉన్నా.. కామ మృగాళ్లు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఆడది కనిపిస్తే పిచ్చికుక్కల్లా మీదపడి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా తమిళనాడులో మైనర్ బాలికపై పుట్టినరోజు నాడే ఆరుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నవంబర్ 26న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. Also Read: కోయంబత్తూర్‌కి చెందిన ఓ ఇంటర్ ఫస్టియర్ బాలిక నవంబర్ 26న తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితుడితో కలిసి ఓ పార్కుకు వెళ్లింది. అక్కడే అతడి సమక్షంలో కేక్ కట్ చేసి వేడుక జరుపుకుంది. ఆ రోజు రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరూ తిరిగి వెళ్తున్న సమయంలో ఓ గ్యాంగ్ అడ్డుకుంది. బాలిక ఫ్రెండ్‌ని వారు చితకబాదడంతో అతడు పారిపోయాడు. దీంతో ఆరుగురు వ్యక్తులు ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లి ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ తతంగాన్నంతా సెల్‌ఫోన్లో రికార్డ్ చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియో సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించి బాధితురాలిని వదిలేశారు. Also Read: ఈ ఘటన గురించి బాధితురాలు మరుసటి రోజు తల్లిదండ్రులకు చెప్పడంగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక వాంగ్మూలం తీసుకున్న పోలీసులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులపై ఐపీసీ 354, 506 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితుల్లో నలుగురిని అరెస్ట్ చేసి.. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Y2As9b
0 Comments