భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన జరిగింది. భర్త పెట్టే వేధింపులు భరించలేక ఓ మహిళ అతడిని దారుణంగా నరికి చంపేసింది. పినపాక మండలం గొల్లబయ్యారం గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. Also Read: గ్రామానికి చెందిన నర్సింహారావు(37), జ్యోతి భార్యభర్తలు. వీరికి కొడుకు, కుమార్తె ఉన్నారు. కొన్నాళ్లుగా దంపతుల మధ్య కుటుంబ, ఆర్థిక విషయాల్లో గొడవలు జరుగుతున్నాయి. నర్సింహారావు ఏ విషయంలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని జ్యోతి తరుచూ వాగ్వాదానికి దిగుతోంది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి వారి ఇంటి నుంచి పెద్ద కేకలు వినిపించడంతో స్థానికులంతా వెళ్లి చూడగా నర్సింహారావు రక్తపుమడుగులో పడి ఉన్నాడు. దీంతో వారు వెంటనే 108 వాహనంలో భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మార్గమధ్యలోనే చనిపోయాడు. Also Read: ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని జ్యోతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. భర్త తీరుతో విసిగిపోయిన తానే హత్య చేసినట్లు ఆమె అంగీకరించింది. శుక్రవారం రాత్రి భర్త తనకు కోపం తెప్పించేలా ప్రవర్తించాడని, దీంతో కూరగాయలు కోసే కత్తితో అతడి మెడ, వీపు భాగంలో బలంగా పొడిచినట్లు నిందితురాలు చెప్పింది. అయితే తాను కావాలని భర్తను చంపలేదని చెబుతోంది. ఆవేశంలో చేసిన తప్పుకు నర్సింహారావు చనిపోగా.. జ్యోతి జైలుపాలైంది. దీంతో వారి ఇద్దరి బిడ్డల భవిష్యత్ అగ్యమగోచరంగా మారింది. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Rf6cqn
0 Comments