హైదరాబాద్‌లో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద స్థితిలో అనుమానాస్పద మృతి చెందిన ఘటన కలకలం రేపింది. సనత్‌నగర్‌లో నివసించే పూర్ణిమ ఓ సంస్థలో పనిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే దాసరి కార్తీక్ అనే యువకుడిని ప్రేమించింది. పెద్దలు అంగీకరించకపోవడంతో 20 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకుంది. Also Read: అయితే పూర్ణిమ బుధవారం తన ఇంట్లోనే విగతజీవిగా కనిపించింది. దీనిపై సమాచారం అందుకున్న సనత్‌నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే తమ కూతురిని భర్త కార్తీకే కొట్టి చంపేశాడని పూర్ణిమ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read: పూర్ణిమ మృతికి కారణమైన కార్తీక్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఆమె తల్లిదండ్రులు, బంధువులు సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో సనత్‌నగర్ పీఎస్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేపట్టి న్యాయం చేస్తామని పోలీసులు పూర్ణిమ కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3801baR
0 Comments