అదనపు కట్నం వేధింపులు తాళలేక ఐదు నెలల గర్భిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. షేక్‌పేట దత్తాత్రేనగర్‌కు చెందిన ప్రభాకర్, శేషమ్మలకు సౌమ్య(18) ఒక్కగానొక్క కుమార్తె. ఏడు నెలల క్రితం సౌమ్యకు తమ సమీప బంధువైన ఫిల్మ్‌నగర్‌కు చెందిన శివకుమార్‌తో పెళ్లి జరిగింది. కొద్దిరోజులుగా శివకుమార్‌తో పాటు అతని తల్లి రుక్మమ్మ, చిన్నమ్మ భుషి.. అదనపు కట్నం తీసుకురావాలంటూ సౌమ్యను వేధిస్తున్నారు. Also Read: ప్రస్తుతం సౌమ్య ఐదు నెలల గర్భిణి. కడుపుతో ఉందన్న జాలి కూడా లేకుండా వారు ఆమెను తీవ్రంగా వేధిస్తున్నారు. దీంతో ఆమె నెలరోజులుగా షేక్‌పేటలోని పుట్టింట్లో ఉంటోంది. తన జీవితం ఇలా అయిపోయిందన్న మనస్తాపంతో గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సౌమ్య ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాసేపటి తర్వాత ఇంటికొచ్చిన కుటుంబసభ్యులు ఫ్యాన్‌కు వేలాడుతున్న సౌమ్యను చూసి షాకయ్యారు. Also Read: వెంటనే ఆమెను కిందికి దించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. అదనపు కట్నం వేధింపులతోనే తమ కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు సౌమ్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గోల్కొండ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఒక్కగానొక్క కూతురు పెళ్లయిన ఏడు నెలలకే బలవన్మరణానికి పాల్పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2sHkqG5
No comments:
Post a Comment