తమిళనాడులోని పెరంబూర్‌లోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు హరిశాంతి (32) ఆత్మహత్య వ్యవహారంలో చిక్కుముడి వీడింది. టీడీజీ వైష్ణవ కళాశాలలోని తెలుగు శాఖ ప్రొఫెసర్ నటరాజ్‌ను నిందితుడిగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా, రిమాండ్ విధించింది. దీంతో నటరాజ్‌ను పుళల్ జైలుకు తరలించారు. Also Read: ఐదేళ్ల క్రితం అరుంబాక్కంలోని డీజీ వైష్ణవ కళాశాల తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసిన హరిశాంతి.. తర్వాత పెరంబూరు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేస్తోంది. అయితే గత మంగళవారం రాత్రి డీజీ వైష్ణవ కళాశాల తెలుగు శాఖ తరగతి గదిలో హరిశాంతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అరుంబాక్కం పోలీసుల విచారణ జరిపారు. అందులో హరిశాంతి ఆత్మహత్యకు, ప్రొఫెసర్ నటరాజ్‌కు సంబంధం ఉన్నట్లు తేలడంతో అతడిని అరెస్టు చేశారు. ఎగ్మూర్ మేజిస్ర్టేట్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం పుళల్ జైలుకు రిమాండ్‌కు తరలించారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2sSCai0
No comments:
Post a Comment