పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. గుజరాత్‌లో గురువారం నాటి ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. అహ్మదాబాద్‌లోని షా ఈ అలామ్ ప్రాంతంలో జరిగిన ఆందోళనల్లో పోలీసులపై నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. ర్యాలీగా వెళ్తున్న ఆందోళనకారులు ఒక్కసారిగా పోలీసుల వాహనాలను అడ్డుకుని వారిపై రాళ్లు రువ్వారు. పోలీసులపై ఆందోళనకారులు దాడిచేయగా వారిని ఏడుగురు ముస్లిం యువకులు రక్షించారు. ప్రాణాలకు తెగించి పోలీసులను రక్షించడానికి యువకుల చేసిన సాహసంపై ప్రశంసలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఏఏకి వ్యతిరేకంగా గుజరాత్ బంద్‌కు పిలుపునివ్వగా, షా ఈ అలాం ప్రాంతంలో భారీ ర్యాలీ చేపట్టారు. పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు పాల్గొన్నారు. వారిని అడ్డుకునే ప్రయత్నం 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఇదే సమయంలో నిరసనకాలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఓ పోలీస్‌పై ఇటుకలు, ప్లాస్టిక్ కుర్చీతో ఆందోళనకారులు దాడిచేయగా, ఓ యువకుడు వచ్చిన ఆయనను కాపాడే ప్రయత్నం చేశాడు. దాడి ఆపాలని కోరుతూ పోలీస్‌ను రక్షించడానికి ఆ యువకుడు ప్రయత్నిస్తుండగా మరికొందరు మద్దతుగా నిలిచారు. ఆందోళనల్లో గాయపడిన పోలీస్‌ను సురక్షిత ప్రదేశానికి తరలించారు. పోలీసులను కాపాడటానికి ముస్లిం యువకులు చేసిన సాహసానికి సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆందోళనకారులు వెళ్లిపోయిన తర్వాత ఆ యువకులను పోలీసులు అభినందించారు. దీనిపై స్థానిక కార్పొరేటర్ బద్రుద్దీన్ షేక్ మాట్లాడుతూ... ఆగ్రహంతో రగలిపోతున్న ఆందోళనకారుల నుంచి పోలీసులను రక్షించడానికి యువకులు చొరవతీసుకున్నారు... చివరికి మానవత్వం గెలిచిందని అన్నారు. ఆందోళనకారుల రాళ్లదాడిలో కనీసం ఐదుగురు పోలీసులు గాయపడినట్టు అధికారులు పేర్కొన్నారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2s7enup
No comments:
Post a Comment