సహనటితో టీవీ నటుడి అక్రమ సంబంధం.. భార్య ఫిర్యాదుతో జైలుకి

తమిళంలో బుల్లితెరపై అక్రమ సంబంధం వ్యవహారం కలకలం రేపుతోంది. టీవీ నటుడైన ఈశ్వర్‌ తనను పట్టించుకోకుండా మరో నటితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆయన భార్య, టీవీ నటి జయశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘వంశం’ సీరియల్‌ ద్వారా సుపరిచితమైన నటి జయశ్రీ....తన సహనటుడు ఈశ్వర్‌‌ రఘునాథ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తిరువాన్మయూర్‌ కామరాజర్‌ నగర్‌లో కాపురం ఉంటున్న వీరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. Also Read: భర్త తన ఆస్తులకు చెందిన డాక్యుమెంట్స్‌ను తనఖా పెట్టాడని, రోజూ కొడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడని జయశ్రీ అడయార్‌లోని మహిళా పోలీస్‌‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో నేరం చేసినట్లు తెలియడంతో ఈశ్వర్‌ను సోమవారం అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే మంగళవారం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చిన జయశ్రీ భర్తపై మరో ఫిర్యాదు చేసింది. Also Read: భర్తను అరెస్ట్ చేయించడంతో తనకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. తన భర్త ఈశ్వర్‌ సహనటితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో పాటు తాగుడు, ఇతర వ్యసనాలకు బానిసై తనను వేధిస్తున్నాడని జయశ్రీ ఆరోపిస్తున్నారు. అక్రమ సంబంధం పెట్టుకున్న నటికి తన ముందే వీడియో కాల్‌ చేసి అసభ్యంగా ప్రవర్తించేవాడని, అతడి వేధింపులు భరించలేకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. మరోవైపు జయశ్రీకి వస్తున్న బెదిరింపు కాల్స్‌పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/388Fhm7

Post a Comment

0 Comments