Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Friday, 20 December 2019

జార్ఖండ్‌లో బీజేపీకి షాక్.. కాంగ్రెస్ కూటమిదే విజయం: ఎగ్జిట్ పోల్స్

జార్ఖండ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. మొత్తం 81 స్థానాలకు ఐదు విడతల్లో ఎన్నికలు నిర్వహించగా, ఫలితాలు డిసెంబరు 23న వెల్లడికానున్నాయి. పోలింగ్ ప్రక్రియ ముగియడంతో వివిధ సంస్థలు విడుదల చేశాయి. ఈ ఎన్నికల్లో అధికార షాక్ తప్పదని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. జార్ఖండ్ ఏర్పడిన తర్వాత తొలిసారి ఐదేళ్లు పూర్తికాలం అధికారంలో ఉన్న బీజేపీని ప్రస్తుతం ఎన్నికల్లో ఓటర్లు తిరస్కరించారని తెలిపాయి. టైమ్స్ నౌ అంచనా ప్రకారం.. కూటమి 38 నుంచి 50 స్థానాలు, బీజేపీ 22 నుంచి 32 చోట్ల విజయం సాధిస్తుందని, జార్ఖంగ్ వికాస్ మోర్చా మూడు, ఇతరులు ఆరు చోట్ల విజయం సాధించే అవకాశ ఉందని తెలిపింది. ఇండియా టుడే- యాక్సిస్ అంచనాలు కూడా దీనికి దగ్గరగా ఉన్నాయి. కాంగ్రెస్-జేఎంఎం కూటమి 43, బీజేపీ 27, జేవీఎం 3, ఏజేఎస్‌యూ 5, ఇతరులు మూడు చోట్ల గెలుస్తారని ఆ సర్వే వెల్లడించింది. సీ ఓటర్ సర్వే ప్రకారం కాంగ్రెస్ కూటమి 31 నుంచి 39, బీజేపీ 28 నుంచి 36 చోట్ల గెలుపొందుతుందని పేర్కొంది. ఐఏఎన్ఎస్ సీ ఓటర్-ఏబీపీ సర్వే మాత్రం కాంగ్రెస్ కూటమి, బీజేపీ మధ్య కేవలం మూడు సీట్ల వ్యత్యాసం మాత్రమే ఉంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్ కూటమి 35, బీజేపీ 32, జేవీఎం 2, ఏజేఎస్‌యూ 5, ఇతరులు 7 చోట్ల విజయం సాధించే అవకాశం ఉందని ఆ సర్వేలో తేలింది. వాస్తవ ఫలితాల్లో ఇవే అంచనాలు నిజమైతే బీజేపీ నుంచి మరో రాష్ట్రం చేజారుతుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 14 పార్లమెంటు స్థానాలకు గానూ 11 చోట్ల బీజేపీ జయకేతనం ఎగురవేసింది. అయితే, ఏజేఎస్‌యూతో పొత్తుపెట్టుకున్న బీజేపీకి సార్వత్రిక ఎన్నికల్లో లబ్ది చేకూరింది. కానీ, ఆరు నెలల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్న ఏజేఎస్‌యూ బీజేపీతో విబేధాలు కారణంగా పొత్తు చెడింది. దీంతో బీజేపీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లింది. మొన్నటికి మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించినా, శివసేన ఇచ్చిన ఝలక్‌తో అధికారానికి దూరమైంది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2EC7eVM

No comments:

Post a Comment