రాజధాని అంశంపై మధ్యంతర నివేదికను జగన్ సర్కారుకు అందజేసింది. గ్రీన్ ఫీల్డ్ రాజధాని బదులు బ్రౌన్ ఫీల్డ్ రాజధాని ఏర్పాటు చేస్తే సత్వర అభివృద్ధి సాధ్యం అవుతుందని బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ అభిప్రాయపడింది. కొత్తగా రాజధానిని నిర్మించే బదులు.. ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం రాజధాని అయితే.. మరింత వేగంగా డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుందనే అభిప్రాయాన్ని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వ్యక్తం చేసింది. మరో నెల రోజుల్లో ఈ కమిటీ పూర్తి స్థాయి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. కొత్తగా రాజధాని నగరాన్ని నిర్మించడాన్ని గ్రీన్‌ఫీల్డ్ రాజధాని అంటారు. ఇందులో ప్రతి నిర్మాణమూ కొత్తదే ఉంటుంది. బ్రౌన్ ఫీల్డ్ క్యాపిటల్ విషయానికి వస్తే.. ఇప్పటికే ఉన్న నగరంలో రాజధానిని ఏర్పాటు చేస్తారు. జీఎన్ రావు కమిటీ శుక్రవారమే విషయమై సీఎం జగన్‌కు నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. కర్నూలులో హైకోర్టు, విశాఖలో సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. ఈ కమిటీ నివేదికపై డిసెంబర్ 27న క్యాబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2ZfWbLw
No comments:
Post a Comment