యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసిన పక్కింటి కుర్రాడు.. చివరికి

తెలుగు రాష్ట్రాల్లో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ యువతి స్నానం చేస్తుండగా ఓ ఆకతాయి సెల్‌ఫోన్లో వీడియో తీశాడు. బాధితురాలు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాడి ఆట కట్టించారు. Also Read: బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 10లో నివసించే యూసుఫ్‌ ఫరూక్‌ (19) తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. అతడి పక్కింట్లో కొందరు అమ్మాయిలు ఉంటున్నారు. మంగళవారం ఉదయం ఓ యువతి బాత్రూమ్‌లో స్నానం చేస్తుండగా ఫరూక్ కిటికీలో నుంచి చాటుగా చూస్తూ తన సెల్‌ఫోన్లో వీడియో తీశాడు. అతడిని గమనించిన యువతి వెంటనే బట్టలు వేసుకుని గదిలోకి వెళ్లి డయల్ 100కి ఫోన్ చేసింది. Also Read: కేవలం నాలుగు నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్న పోలీసులు యువతి వాంగ్మూలం తీసకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి సెల్‌ఫోన్లో పలు అసభ్య ఫోటోలు, వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. ఫరూక్ గతంలోనూ ఇదే విధంగా చాలా మంది వీడియోలు తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2OKUrGq

Post a Comment

0 Comments