దిశ చట్టం వచ్చినా ఆంధ్రప్రదేశ్‌లో ఆడవాళ్లపై అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. తాజాగా కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఓ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని సుందరయ్య కాలనీలో నివసించే మహిళ భర్తకు దూరంగా ఉంటూ 16ఏళ్ల కుమార్తెతో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు అదే గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. Also Read: ఆ యువకుడు అప్పుడప్పుడూ మహిళ ఇంటికి వచ్చిన రాసలీలలు కొనసాగిస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో ప్రియురాలి కుమార్తెపై అతడి కన్ను పడింది. ఈ నెల 14వ తేదీన ఆమె ఇంటికి వెళ్లగా బాలిక ఒంటరిగా ఉంది. తన కోరిక తీర్చుకోవడానికి అదే సరైన సమయమని భావించిన ఆ కామాంధుడు బాలికను మాటల్లోకి దించాడు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఆమెతో తాగించాడు. మత్తులోకి జారుకున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. Also Read: తన పథకం ఫలించడంతో రోజూ ఏదొక సమయంలో బాలిక ఇంటికి వచ్చి ఇదే తరహాలో అత్యాచారం చేస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించిన బాలిక తల్లికి చెప్పడంతో ఆమె తన ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గురువారం నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/38Tb9vc
No comments:
Post a Comment