దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ హత్యాచారం ఘటనలో నలుగురు నిందితులు ప్రస్తుతం చర్లపల్లిలో జైలులో ఉన్నారు. వారిని తమ కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై షాద్‌నగర్ న్యాయస్థానం ఈరోజు విచారణ జరపనుంది. మరోవైపు ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన మహ్మద్ ఆరిఫ్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. Also Read: చర్లపల్లి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎం.సంపత్ మంగళవారం నిందితుల గదులను పరిశీలించి వారితో మాట్లాడారు. జైల్లో దోమలు ఎక్కువగా ఉండటంతో ఇబ్బంది పడుతున్నామని నిందితులు ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. ఆరిఫ్ అస్వస్థతతో ఉన్నట్లు గుర్తించిన ఆయన డాక్టర్‌తో పరీక్ష చేయించారు. అతడు జ్వరంతో బాధపడుతున్నాడని చెప్పిన డాక్టర్ కొన్ని మందులు వేసుకోమని ఇచ్చారు. Also Read: ఇదే కేసులో మరో నిందితుడు కిడ్నీ సమస్యతో బాధపడుతుండటంతో అతడికీ వైద్యం అందిస్తున్నట్లు జైలు వర్గాలు చెబుతున్నాయి. నలుగురు నిందితులు తమ గదులు దాటి బయటకు రాకుండా నిత్యం సిబ్బంది పహారా కాస్తున్నారు. వారికి టిఫిన్, భోజనం తలుపు కింద నుంచే అందిస్తు్న్నారు. లోపలే బాత్రూమ్ కూడా ఉంది. మరోవైపు నలుగురు కామాంధులను వెంటనే ఉరి తీయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2RjryCK
0 Comments