హైదరాబాద్‌లో ఐదు రోజుల క్రితం కనిపించకుండా పోయిన మౌనిక అనే యువతి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన మౌనిక హిమాయత్‌నగర్‌లోని హాస్టల్‌లో ఉంటూ నారాయణగూడలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో ఫస్టియర్ చదువుతోంది. హిమాయత్‌నగర్ నుంచి రోజూ కాలేజీకి వెళ్లే తనను సాయి అనే యువకుడు వేధిస్తున్నాడని, వేధింపులు భరించలేకపోతున్నానని, దీంతో హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంటానని మౌనిక లేఖ రాసి కనిపించకుండా పోయింది. Also Read: ఆ ఉత్తరాన్ని చూసిన విద్యార్థులు హాస్టల్ యాజమాన్యానికి ఇవ్వగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మౌనిక తండ్రి ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. ట్యాంక్ బండ్, ఎంజీ రోడ్ మినిస్టర్ రోడ్ బేగంపేట ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించినా ఎలాంటి క్లూ లభించలేదు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో నారాయణగూడ పోలీసులు గుంటూరులో గాలించారు. Also Read: చివరకు ఆదివారం ఆమె ఉన్న ప్రాంతాన్ని గుర్తించి మౌనికను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆమె పక్కన అబ్బాయిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొస్తున్నారు. మౌనికతో పాటు ఉన్న అబ్బాయి ఎవరన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. అతడి కోసమే ఆమె నుంచి వచ్చిందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఐదురోజుల పాటు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన మౌనిక ఉదంతం సుఖాంతం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2r5TUFZ
0 Comments