Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Thursday, 19 December 2019

హైదరాబాద్‌లో కీచక డాక్టర్.. చికిత్సకు వచ్చిన మహిళపై అఘాయిత్యం

కడుపునొప్పితో బాధపడుతూ చికిత్స కోసం వచ్చిన మహిళ పట్ల ఓ డాక్టర్ అత్యాచారానికి యత్నించిన ఘటన చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పాతబస్తీ యాఖుత్‌పురా ఈదీబజార్‌ ప్రాంతానికి చెందిన డాక్టర్ అలీయుద్దీన్‌ అహ్మద్‌ రాహి (72) బండ్లగూడలో క్లినిక్‌ను నిర్వహిస్తున్నాడు. కడుపు నొప్పి బాధపడుతున్న బండ్లగూడకు చెందిన ఓ వివాహిత(22) ఈ నెల 16వ తేదీన భర్తతో కలిసి క్లినిక్‌కు వచ్చింది. Also Read: భర్తను బయటే ఉండమని చెప్పిన డాక్టర్ రాహి.. బాధితురాలిని లోనికి పిలిచి వివరాలు కనుక్కున్నాడు. చికిత్స నెపంతో ఆమెపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. లోపల తలుపు వేసి అఘాయిత్యం చేసేందుకు యత్నించగా బాధితురాలు అతడిని తోసేసి బయటకు పరుగు తీసింది. ఈ ఘటనపై డాక్టర్‌ను నిలదీసిన బాధితురాలి భర్త.. పరువు పోతుందన్న భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా భార్యను ఇంటికి తీసుకెళ్లిపోయాడు. Also Read: ఈ జరిగిన విషయం తెలుసుకున్న అత్త, ఆడపడుచుల సలహాతో బాధితురాలు బుధవారం రాత్రి చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాక్టర్ ఎ.ఎ.రాహిని గురువారం సాయంత్రం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2EB2DTF

No comments:

Post a Comment