
అవినీతి నిరోధక అధికారులు ఎన్నో తనిఖీలు చేసి ఎందరు లంచావతారాలను పట్టుకుంటున్నా ప్రభుత్వోద్యోగుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. ఎంత చదువుకున్నా, ఉన్నతస్థాయిలో ఉన్నా కూడా లంచం కోసం ఆశపడుతున్నారు. తాజాగా తెలంగాణలో ఏసీబీ అధికారుల వలలో మరో అవినీతి చేప చిక్కింది. నాగర్ కర్నూలు జిల్లాలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటున్న ఉద్యోగిని అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. Also Read: తాడూరు మండలం డిప్యూటీ తహసీల్దార్ జయలక్ష్మి కలెక్టరేట్‌లోని సీ బ్లాక్‌లో ఇంచార్జ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తోంది. తిమ్మాజీపేట మండలం మారేపల్లి గ్రామంలో వివాదంలో ఉన్న భూమికి సంబంధించి వెంకటయ్య అనే వ్యక్తి పట్టా మార్పు కోసం కొద్దిరోజుల క్రితం ఆమె కలిశాడు. అయితే పట్టా మార్చడానికి జయలక్ష్మి ఏకంగా రూ.13లక్షల లంచం డిమాండ్ చేశారు. అయితే తన దగ్గర అంత డబ్బు లేదని వెంకటయ్య చెప్పినా ఆమె వినలేదు. రూ.13లక్షలిస్తేనే పని పూర్తి చేస్తానని తేల్చిచెప్పారు. Also Read: అయితే మొదటి విడతగా రూ.లక్ష ఇస్తానని, పని పూర్తయ్యాక మిగిలిన డబ్బు ఇస్తానని వెంకటయ్య చెప్పగా ఆమె అంగీకరించింది. దీంతో బాధితుడు నేరుగా ఏసీబీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఏసీబీ అధికారులు పక్కా పథకం ప్రకారం అతడిని ఈరోజు జయలక్ష్మి కార్యాలయానికి పంపించారు. రూ.లక్ష నగదు లంచం తీసుకుంటుండగా ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకుని ప్రశ్నిస్తున్నారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2vdexSD
No comments:
Post a Comment