
మరో ఘోరం చోటుచేసుకుంది. అభంశుభం తెలియని చిన్నారిపై కామాంధులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఆడుకుందామని చెప్పి చిన్నారిని ఎత్తుకెళ్లి ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక నీరసంగా తలనొప్పి అని ఏడుస్తుండడంతో ఏమైందో అర్థంకాని తల్లి.. నెమ్మదిగా ఆరా తీయడంతో గుండెబద్దలయ్యే విషయం తెలిసింది. పట్టణంలోని ఓ కాలనీకి చెందిన తొమ్మిదేళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగుచూసింది. అభం శుభం తెలియని మూడో తరగతి చిన్నారిని ఆటాడుకుందామని నమ్మించి ముగ్గురు వ్యక్తులు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం చిన్నారిని ఇంటి దగ్గర వదిలి వెళ్లారు. అప్పటి నుంచి చిన్నారి నీరసంగా ఉంటూ తలనొప్పి వస్తోందంటూ ఏడుస్తోంది. Also Read: ఏమైందని తల్లి ఆరా తీయగా.. చిన్నారి అసలు విషయం చెప్పింది. దీంతో చిన్నారి తల్లి కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల్లో ఒకరు మైనర్ కాగా, మిగిలిన ఇద్దరు మేజర్లేనని పోలీసులు తెలిపారు. Read Also:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Tl4suN
No comments:
Post a Comment