రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న సెక్స్‌రాకెట్‌ను పోలీసులు చేధించారు. అశోక్‌నగర్‌లోని ఓ స్పా సెంటర్లో కొనసాగుతున్న వ్యభిచార కేంద్రాన్ని సోమవారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా స్పా సెంటర్ యజమానితో పాటు విటుడు, ఇద్దరు యువతులను అరెస్ట్ చేశారు. Also Read: జైపూర్‌లోని గోడౌన్ సర్కిల్ 22లో షాపింగ్ మాల్లో హెవెన్స్ థాయ్ మసాజ్ పేరుతో ఓ స్పా సెంటర్ నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆ సెంటర్‌కు రాత్రివేళ యువకులు అధికంగా వచ్చి ఎక్కువ సమయం ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఓ వ్యక్తిని విటుడి రూపంలో అక్కడికి పంపించారు. ఆ వ్యక్తి స్పా సెంటర్ యజమానికి సంప్రదించి అమ్మాయి కావాలని కోరగా అతడు డబ్బులు తీసుకుని గదిలోకి పంపించాడు. Also Read: అమ్మాయితో రూమ్‌లోకి వెళ్లిన తర్వాత నకిలీ కస్టమర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు స్పా సెంటర్‌పై రైడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడితో పాటు ఓ విటులు, ఇద్దరు సెక్స్‌వర్కర్లను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో చాలాకాలం నుంచి వ్యభిచార దందా నడుస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి మసాజ్ చేసేందుకని చెప్పి మహిళలను తీసుకొచ్చి వారిని ప్రలోభాలకు గురిచేసి వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులు తెలిపారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/37VSttQ
No comments:
Post a Comment