Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Thursday, 6 February 2020

కరోనా వైరస్‌‌ విషయంలో కీలక పరిణామం.. వ్యాక్సిన్ కనిపెట్టిన భారతీయ శాస్త్రవేత్త

పేరు వింటేనే ప్రపంచ దేశాలు గజగజ వణుకుతున్నాయి. ఈ ప్రాణాంతక వైరస్ ఇప్పటికే చైనాలో స్వైరవిహారం చేస్తూ ప్రాణాలను హరిస్తోంది. ఇప్పటి వరకూ చైనాకే పరిమితమైన వైరస్ మరణాలు క్రమంగా పొరుగు దేశాల్లోనూ చోటుచేసుకోవడంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా వైరస్‌కు విరుగుడు కోసం శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ శాస్త్రవేత్త నేతృత్వంలోని ఆస్ట్రేలియా బృందం వైరస్‌ను నిరోధించే వ్యాక్సిన్ రూపకల్పనలో కీలక పురోగతి సాధించింది. ఆస్ట్రేలియాలోని కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (సిఎస్ఐఆర్ఓ) హైసెక్యూరిటీ ల్యాబ్‌ పరిశోధనల్లో కరోనాకు విరుగుడు కనిపెట్టారు. ఆస్ట్రేలియాలోని డోహెర్టీ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు గత వారం కరోనా సోకిన వ్యక్తి రక్త నమూనాల నుంచి వైరస్‌ను వేరు చేయగలిగారు. తాజాగీ సీఎస్ఐఆర్ఓ పరిశోధకులు తమ ప్రాథమిక అధ్యయనంలో వైరస్ యొక్క పెరుగుదలను గుర్తించారు. దీనిపై అధ్యయనానికి నేతృత్వం వహిస్తోన్న భారతీయ సంతతి శాస్త్రవేత్త మాట్లాడుతూ.. రక్త నమూనాల నుంచి వైరస్‌ను వేరుచేసిన సమాచారాన్ని తమతో పంచుకున్న డోహెర్టీ ఇన్‌స్టిట్యూట్ సహోద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. దీని ఆధారంగా ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న వ్యాక్సిన్.. వైరస్ సోకినవారిపై నేరుగా ప్రయోగించి, దాని సమర్ధతను పరీక్షిస్తామని, ఇది మరింత వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. ఎమర్జెన్సీ ప్రిపేరేడ్‌నెస్ ఇన్నోవేషన్స్ భాగస్వామ్యంతో సీఎస్ఐఆర్ఓ చేపట్టిన వ్యాక్సిన్ ప్రీక్లినికల్ ఇవేల్యూషన్ ప్రాజెక్టులో ప్రొఫెసర్ వాసన్ ప్రధాన పరిశోధకుడిగా ఉన్నారు. ఆస్ట్రేలియా జంతు ఆరోగ్య ల్యాబొరేటరీలో తన సహచరులు కూడా కరోనా వైరస్ నిర్ధారణ, చికిత్స గురించి పరిశోధనలు చేస్తున్నట్టు వాసన్ తెలిపారు. వ్యాక్సిన్ అభివృద్ధికి క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీ చేస్తున్న పరిశోధనలకు కూడా సీఎస్ఐఆర్ఓ సహకారం అందజేస్తోందన్నారు. ప్రస్తుతం వైరస్ వ్యాక్సిన్‌ను మరింత మెరుగపరిచే పనిలో ఉన్నామని డాక్టర్ వాసస్ వివరించారు. అయితే, సీఎస్ఐఆర్ఓ మాత్రం దీని పరిమాణంపై ఎలా స్పష్టత ఇవ్వలేదు. కానీ, కరోనా వైరస్‌ వ్యాక్సిన్ విషయంలో ప్రిలినికల్ అధ్యయనాలను పక్కనబెట్టి పూర్తిస్థాయిలో చికిత్సకు అవసరమైన విధంగా అభివృద్ధికి పరిశోధన వేగవంతం చేసినట్టు వాసన్ తెలిపారు. బిట్స్ పిలానీ, ఐఐఎస్‌సీ-బెంగళూరులో విద్యాభ్యాసం పూర్తిచేసిన డాక్టర్ వాసన్.. రోడ్స్ స్కాలర్‌షిప్ సహకారంతో ఆక్స్‌ఫర్డ్‌లోని ట్రినిటీ కాలేజీలో పరిశోధనలకు లండన్ వెళ్లారు. డెంగ్యూ, చికెన్‌గున్యా, జికా లాంటి వైరస్‌ల గురించి అధ్యయనం చేశారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/39g9Jue

No comments:

Post a Comment