Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 24 February 2020

ఆరుగురు సుప్రీంకోర్టు జడ్జ్‌లకు స్వైన్ ఫ్లూ.. సుప్రీం అత్యవసర భేటీ

మరోసారి దేశంలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా, ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ వైరస్ బారినపడ్డారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే అధ్యక్షతన అత్యవసర సమావేశం ఏర్పాటుచేయనున్నట్టు జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రకటించారు. స్వైన్‌‌ఫ్లూ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. న్యాయవాదులకు స్వైన్‌ఫ్లూ టీకాలు వేయించాలని నిర్ణయించినట్టు జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు. జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ కూడా మంగళవారం ఆలస్యంగా ప్రారంభమైంది. ఒకటో నెంబరు హాల్‌‌లో షెడ్యూల్ కంటే 30 నిమిషాలు ఆలస్యంగా విచారణ ప్రారంభం కావడంపై కోర్టు మాస్టర్స్ కూడా కారణాలు వెల్లడించలేదు. ఓవైపు, కరోనా వైరస్‌తో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుండగా... కేసులు బయటపడటం మరింత కలవరానికి గురిచేస్తోంది. హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లో స్వైన్‌ఫ్లూ లక్షణాలతో చేరిన ఓ గర్భిణి చికిత్స పొందుతూ మృతిచెందింది. వైద్యులు ఆపరేషన్ చేసి బిడ్డను రక్షించారు. కరీంనగర్‌కు చెందిన షహనాజ్‌కు సోకడంతో తొలుత అక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేశారు. అయితే పరిస్థితి విషమించడంతో గత మంగళవారం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో గుండెపోటు రావడంతో సోమవారం తెల్లవారుజామున ఆమె కన్నుమూసింది. అయితే గాంధీ ఆస్పత్రిలో చేరిన సమయంలో వైద్యం సరిగా చేయలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో డ్యూటీ డాక్టర్లకు వైద్యశాఖ అధికారులు మెమో జారీ చేశారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందిన షహనాజ్ స్వస్థలం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్. కాగా, జర్మనీకి చెందిన సాఫ్ట్‌వేర్ సంస్థ శాప్‌‌లో పనిచేసే ఇద్దరికి హెచ్1ఎన్1 వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో బెంగళూరు, ముంబయి, గురుగావ్‌ల్లోని తన కార్యాలయాలను శాప్ మూసివేసింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 20 వరకు కర్ణాటకలో 175 హెచ్1ఎన్1 కేసులు నమోదయ్యాయి. ఇందులో 38 శాతం అంటే 67 కేసులు బెంగళూరులోనే బయటపడ్డాయి. కాలానుగుణంగా H1N1 వైరస్ గాలి ద్వారా సంక్రమిస్తుంది. ఈ వైరస్ బాధితులు దగ్గినా లేదా తుమ్మినా, వారు తాకిన వస్తువుల ద్వారా కూడా పరోక్షంగా వ్యాపిస్తుంది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/38XpR3Z

No comments:

Post a Comment