Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 4 February 2020

రామమందిర నిర్మాణంపై లోక్‌సభలో ప్రధాని మోదీ కీలక ప్రకటన

ఆయోధ్యలోని విషయంలో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. మందిర నిర్మాణంపై క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభను ఉద్దేశించిన ప్రసంగించిన ప్రధాని.. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఓ ట్రస్ట్‌ను ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. ‘’ పేరుతో ట్రస్ట్ ఏర్పాటుచేసి మందిరాన్ని నిర్మిస్తామని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో వివాదాస్పద భూమిని ఈ ట్రస్ట్‌కు అప్పగిస్తామని మోదీ తెలిపారు. అంతేకాదు, మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు ఐదు ఎకరాల భూమి ఇవ్వాలన్న సుప్రీంకోర్టు సూచనలకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించిందన్నారు. అయోధ్యలో మందిర నిర్మాణానికి అందరూ సహకరించాలని ఈ సందర్భంగా ప్రధాని కోరారు. మసీదు నిర్మాణం కోసం అనువైన స్థలాన్ని గుర్తించాలని సున్నీ వక్ఫ్ బోర్డ్‌ను యూపీ ప్రభుత్వం కోరిందని మోదీ తెలిపారు. దేశంలోని హిందు, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, బౌద్ధులు, పార్సీ లేదా జైనులు అంతా ఒకటే కుటుంబమని మోదీ వ్యాఖ్యానించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను రామమందిర ట్రస్ట్ కాపాడుతుందని మోదీ పేర్కొన్నారు. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల స్థలం గురించి హిందూ, ముస్లింల మధ్య 134 ఏళ్లుగా కొనసాగుతోన్న వివాదంపై గత నవంబరు 9న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ వివాదాస్పల భూమిని మూడు భాగాలుగా చేసి హిందువులకు, ముస్లింలకు పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ స్థలమంతా హిందువులకే చెందుతుందని నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. బాబ్రీ మసీదు ఖాళీ స్థలంలో నిర్మించలేదని, దీనికోసం అక్కడున్న నిర్మాణాన్ని కూల్చివేశారా, లేదా అన్నది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేయలేదని సుప్రీం వ్యాఖ్యానించింది. అన్ని ఆధారాలను పరిశీలించి, ఈ భూమిని రాముడి ఆలయ నిర్మాణం కోసం హిందువులకు ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్‌బోర్డ్‌కు అయోధ్యలోనే ఒక ప్రధాన ప్రాంతంలో ఐదెకరాల స్థలం కేటాయించాలి. రామ్ లల్లా, నిర్మోహీ అఖాడా, సున్నీ వక్ఫ్ బోర్డ్ దాఖలు చేసిన అప్పీళ్లపై తీర్పును జస్టిస్ గొగోయ్ చదివి వినిపించారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2UoOuCc

No comments:

Post a Comment