ఏడేళ్ల క్రితం జిల్లాలో సంచలనం కలిగించిన తల్లీకూతుళ్ల దారుణహత్య కేసులో న్యాయస్థానం సంచలనం సంచలన తీర్పు ఇచ్చింది. దోషిగా తేలిన ఇంతియాజ్ అనే వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. ఇద్దరు మహిళల ప్రాణాలు తీసిన కిరాతకుడికి మరణశిక్షే సరైందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. 2013, ఫిబ్రవరి 12వ తేదీన హరినాథపురానికి చెందిన మెడికో భార్గవి, ఆమె తల్లి శకుంతలను ఇంటియాజ్ అనే యువకుడు మరో ఇద్దరితో కలిసి దారుణంగా చంపేశాడు. Also Read: నెల్లూరు హరనాథపురం రెండో వీధిలో రామాలయం పక్క ఇంట్లో దినకర్‌రెడ్డి అనే వ్యక్తి భార్య శకుంతల, కూతురు భార్గవితో కలిసి నివసించేవాడు. ఓ ఫార్మా కాలేజీకి యజమాని అయిన దినకర్‌రెడ్డి మరో కాలేజీకి ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ రెండు చేతులా సంపాదించేవాడు. తన సొంత కాలేజీతో పాటు ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ పనులను ఇంతియాజ్ అనే వ్యక్తితో చేయించేవాడు. ఈ క్రమంలో వారి ఇంటికి తరుచూ వెళ్లే ఇంతియాజ్ వారి సంపదపై కన్నేశాడు. రోజూ భర్త, కూతురు కాలేజీకి వెళ్లాక ఆమె ఒంటరిగా ఉంటుందని తెలుసుకుని దొంగతనానికి ప్లాన్ వేశాడు. Also Read: శకుంతల ఒంటరిగా ఉందని తెలుసుకున్న ఇంతియాజ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి 2013, ఫిబ్రవరి 12 మధ్యాహ్నం దినకర్‌రెడ్డి ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. ఆ సమయంలో ఊహించని విధంగా భార్గవి కూడా ఇంట్లోనే ఉండటంతో నిందితులు కంగారు పడ్డారు. ఎందుకొచ్చారని శకుంతల అడగ్గా ఇంటీరియర్ డిజైన్ కోసమని అబద్ధం చేశారు. తెలిసిన వారే కావడంతో టీ తెస్తానని ఆమె కిచెన్‌లోకి వెళ్లింది. మరోవైపు చదువుకుంటానంటూ భార్గవి గదిలోకి వెళ్లిపోయింది. ఇదే అదనుగా భావించిన ముగ్గురు కలిసి వంటగదిలోకి వెళ్లి శకుంతలను కత్తితో దారుణంగా పొడిచారు. ఆమె కేకలు విన్న భార్గవి గది నుంచి బయటకు రాగా గొంతు నులిమి చంపేశారు. తర్వాత వారిద్దరి ఒంటి మీదున్న బంగారు నగలు, బీరువాలోని ఇతర వస్తువులను దోచుకున్నారు. Also Read: అదే సమయంలో శకుంతల బంధువులు ఇంటికొచ్చి కాలింగ్ బెల్ కొట్టారు. ఎవరూ తలుపులు తీయకపోవడంతో వారు దినకర్‌రెడ్డికి ఫోన్ చేశారు. దీంతో ఆయన తన ఫ్రెండ్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఇంటి వెనుక నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ముగ్గురు నిందితులు దినకర్‌రెడ్డడిపైనా తీవ్రంగా దాడి చేసి పరారయ్యేందుకు యత్నించారు. దీంతో స్థానికులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసలకు అప్పగించారు. ఇంతియాజ్‌కు సహకరించిన ఇద్దరు నిందితులు మైనర్లు కావడంతో కోర్టు వారికి జైలుశిక్ష విధించింది. ప్రధాన నిందితుడైన ఇంతియాజ్ నేరం నిరూపణ కావడంతో అతడికి మరణశిక్ష విధిస్తూ న్యాయస్థానం సంచలన తీర్పు చెప్పింది. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/399ltyz
No comments:
Post a Comment