నాన్నను చంపేసిన కూతురు.. రక్తపు మడుగులో పడి ఉన్న తండ్రిని లాక్కొచ్చి..

నిత్యం తాగి వస్తున్న తండ్రిని భరించలేని ఓ కూతురు ఘాతుకానికి పాల్పడింది. తండ్రిని అతి దారుణంగా చంపేసింది. రక్తపు మడుగులో పడి ఉన్న తండ్రిని లాగి రోడ్డుపై పడేసిన అమానుష ఘటన వెలుగుచూసింది. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లో జరిగింది. అజ్మర్‌కి చెందిన అశోక్‌కుమార్ ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు యామిని, రాగిణి, కొడుకు సంతానం. తన భార్య, కొడుకు గతంలోనే చనిపోవడంతో కుమార్తె రాగిణి వద్ద ఉంటూ బతుకీడుస్తున్నాడు. ఈ క్రమంలో అశోక్‌కుమార్ తాగుడుకు బానిసగా మారాడు. నిత్యం మందు తాగి ఇంటికి వచ్చేవాడు. Also Read: పనికి వెళ్లకుండా రోజూ మందు తాగొస్తున్న తండ్రిని భరించలేకపోయిన కూతురు రాగిణి.. తండ్రిని చంపేయాలని నిర్ణయించుకుంది. రోజులాగే మందు తాగి ఇంటికొచ్చిన తండ్రి అశోక్ కుమార్‌ని తీవ్రంగా కొట్టింది. గాయాలతో రక్తపు మడుగులో పడిపోయిన తండ్రిని.. అలాగే లాక్కొచ్చి నడిరోడ్డుపై పడేసింది. ఇంట్లోకి వెళ్లి జరిగిన తతంగాన్నంతా సోదరి యామినికి ఫోన్ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2OMFnrx

Post a Comment

0 Comments