Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 24 February 2020

Rajya Sabha Elections తెలుగు రాష్ట్రాల్లో ఆరు సహా 55 స్థానాలకు మార్చి 26న పోలింగ్

రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ ఖాళీ అయ్యే 55 రాజ్యసభ స్థానాలకు మార్చి 26న పోలింగ్ జరగనుంది. మొత్తం 17 రాష్ట్రాల్లో 55 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 4, తెలంగాణ నుంచి రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు మార్చి 6న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంండగా.. మార్చి 13 తుది గడువుగా పేర్కొన్నారు. మార్చి 16న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 18 తుది గడువు. మార్చి 26న 55 స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తారు. ఆయా రాష్ట్రాల శాసనసభల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు లెక్కింపు చేపడతారు. కాగా, తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, గరికపాటి మోహనరావుల పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనుంది. దాంతో ఆ రెండు స్థానాలకు ఎన్నిక జరగనుంది. అలాగే ఏపీ కోటాలో ఎన్నికయిన కేశవరావు పదవీకాలం కూడా ఏప్రిల్‌లోనే ముగుస్తుంది. ఆయనతోపాటు తోట సీతారామలక్ష్మీ, టి. సుబ్బరామి రెడ్డి, మొహమ్మద్‌ అలీ ఖాన్‌ పదవీకాలం ముగియడంతో ఆ స్థానాలకు ఎన్నికల జరగనున్నాయి. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల సభ్యులు ఎన్నుకుంటారు. అందుకే దీన్ని రాష్ట్రాల సభ అంటారు. ఈ సభలో సభ్యుల సంఖ్య 250 కాగా, వీటిలో 12 స్థానాలను వివిధ రంగాల్లో ప్రసిద్ధులైనవారితో రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ఈ సభలో సభ్యుల పదవీ కాలం ఆరేళ్లు కాగా, ప్రతి రెండేళ్లకు ఒకసారి మూడో వంతు సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. అందుకే ఇది శాశ్వత సభ. లోక్‌సభ మాదిరిగా రాజ్యసభ రద్దు కాదు. దీనికి కూడా శాసనాధికారం ఉంటుంది. అయితే ఆర్థిక బిల్లులకు సంబంధించి మాత్రం రాజ్యసభ నిర్ణయాన్ని లోక్‌సభ తిరస్కరించే అధికారం ఉంది. ఇతర బిల్లుల విషయంలో ఇరు సభల మధ్యా వివాదం తలెత్తితే సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తారు. అయితే రాజ్యాంగ సవరణకు సంబంధించిన విషయాల్లో రెండు సభల్లోనూ అంగీకారం పొందితేనే అది సాధ్యపడుతుంది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/38XFf0g

No comments:

Post a Comment