
ఎయిర్‌పోర్టులో కాన్వాయ్‌కు భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు అడ్డుతగిలారు. ఆయన వెళ్లే మార్గంలో రోడ్డు మీద పడుకొని కాన్వాయ్‌ను ముందుకు కదలనీయలేదు. చంద్రబాబు నాయుడు గో బ్యాక్ అంటూ అధికార పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొందరు కార్యకర్తలు బాబు కాన్వాయ్ మీదకు చెప్పులు, కోడి గుడ్లు, టమోటోలు విసిరారు. వైసీపీ కార్యకర్తలు అడ్డు తగలడంతో చంద్రబాబు కాన్వాయ్ ముందుకు కదల్లేదు. దీంతో వాహనం దిగిన ప్రతిపక్ష నేత రోడ్డు మీద నడిచి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. కానీ ఇతర నేతలు వారించడంతో ఆయన వెనక్కి తగ్గారు. విశాఖ నగరానికి నూతన సంస్కృతిని తీసుకొచ్చారని టీడీపీ నేత అనిత విమర్శించారు. చంద్రబాబు నాయుణ్ని జగన్ ఎదుర్కోలేక ఇలా చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. జనాలకు డబ్బులిచ్చి వైసీపీ నేతలు తీసుకొచ్చారని టీడీపీ నాయకులు ఆరోపించారు. బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవడం పట్ల టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సేవ్ వైజాగ్ అని వారు నినదించారు. జగన్ స్క్రిప్ట్ ఇస్తే, అవంతి శ్రీనివాస్ స్క్రిప్ట్ ఇస్తే.. పెయిడ్ ఆర్టిస్టులతో ఇలా చేయిస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. కాన్వాయ్‌ను ముందుకు కదలనీయకుండా వైసీపీ కార్యకర్తలు అడ్డుకోగా... ఎట్టి పరిస్థితుల్లోనూ బాబు పర్యటన కొనసాగుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. స్థానిక నేతలు, పోలీసులు కుమ్మకై మా నాయకుణ్ని ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2TwTX87
No comments:
Post a Comment