⍟ ఉరుముల్లేని పిడుగులా కరోనా మహమ్మారి ప్రపంచదేశాలపై విరుచుకుపడుతోంది. ప్రాణాంతక వైరస్‌ను నిరోధించడానికి ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రజలను ఇళ్లు దాటి బయటకు రావద్దని, పరిశుభత్ర పాటించాలని, సమూహాలకు దూరంగా ఉండాలని పలు దేశాలు సూచిస్తున్నాయి. కొత్తరకం ప్రాణాంతక వైరస్ ప్రస్తుతం 117 దేశాలకు వ్యాపించింది. కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు 10,000 మందికిపైగా మృతిచెందగా, వైరస్ సోకినవారి సంఖ్య 2,45,600 దాటింది. ⍟ మహమ్మారి దెబ్బకు ప్రపంచం చిగురుటాకులా వణుకుతోంది. వైరస్ వెలుగుచూసిన చైనాలో కోవిడ్ తగ్గుముఖం పట్టినా.. మిగతా దేశాల్లో మాత్రం తీవ్రత ఎక్కువుగా ఉంది. ముఖ్యంగా ఇటలీలో మరణ మృందంగం కొనసాగుతోంది. ఇప్పటి వరకూ చైనాలోనే అత్యధికంగా కరోనా మరణాలు చోటుచేసుకోగా.. ఇప్పుడు ఈ సంఖ్యను ఇటలీ దాటేసింది. ⍟ దేశంలో కోవిడ్ మరణాలు నాలుగుకు చేరుకోగా, బాధితుల సంఖ్య 200కు చేరువలో ఉంది. పంజాబ్‌కు చెందిన వ్యక్తి కరోనా వైరస్‌తో గురువారం చనిపోయాడు. గురువారం దేశవ్యాప్తంగా మరో 27 మందికి వైరస్ నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 198కి చేరింది. గడచిన రెండు రోజుల నుంచి కొత్త కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతోంది. రెండు రోజుల్లో మొత్తం 54 కేసులు నమోదయ్యాయి. ⍟ తెలంగాణలో కరోనా కలకలం రేపుతోంది. వైరస్ బారిన పడిన వారి సంఖ్య 16కు చేరింది. గురువారం (మార్చి 19) మరో 2 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. బుధవారం రాత్రి వరకు 13 కేసులు నమోదవగా.. గురువారం మధ్యాహ్నం మరో పాజిటివ్ కేసు నమోదైంది. ⍟ ఏపీలో మూడు పాజిటివ్ కేసులు, తెలంగాణలో 16 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. శుక్రవారం కరోనా పరిస్థితిపై అత్యవసర సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మసీదులు, ఆలయాలు, చర్చీల్లో ఎవరిని అనుమతించ వద్దని కోరారు. ఉగాది, శ్రీరామ నవమి వేడుకలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ⍟ ఏపీలో మూడో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. విశాఖకు చెందిన వ్యక్తికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఇటీవలే సదరు వ్యక్తి మక్కా నుంచి తిరిగొచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ వ్యక్తికి చెస్ట్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3deuEjT
0 Comments