
రోహింగ్యా శరణార్థులకు చెందిన ఓ శిబిరంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో 15 మంది సజీవదహనమయ్యారు. మరో 400 మంది ఆచూకీ తెలియట్లేదు. ఈ దుర్ఘటనలో 500 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ జిల్లాలోని రోహింగ్యాల శిబిరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మయన్మార్‌లో ఘర్షణల అనంతరం దేశం విడిచిపెట్టి వచ్చిన వందలాది మంది ఇక్కడ తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. రోహింగ్యాల శిబిరంలో అగ్నిప్రమాదం సోమవారం (మార్చి 22) సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వందలాది తాత్కాలిక గుడారాలు కాలి బూడిదయ్యాయి. దీంతో వేలాది మంది శరణార్థులు నిరాశ్రయులయ్యారు. ఆత్మీయులను కోల్పోయి, నిరాశ్రయులుగా మారి రోదిస్తున్న రోహింగ్యాల కష్టాలను చూసి పలువురు కంటతడి పెడుతున్నారు. ఇంతటి ఘోరమైన అగ్ని ప్రమాదాన్ని మునుపెన్నడూ చూడలేదని బంగ్లాదేశ్‌లోని ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ ప్రతినిధి ఒకరు మీడియాతో అన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే.. వారు అక్కడికి చేరుకునేలోపే తీవ్ర నష్టం వాటిల్లింది. మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని బాధితులు చెబుతున్నారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3rk72jD
No comments:
Post a Comment