
మహారాష్ట్రను కరోనా వైరస్ మళ్లీ వణికిస్తోంది. దీంతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తోంది. తాజాగా జిల్లాలో లాక్‌డౌన్ విధించింది. నాందేడ్ జిల్లా వ్యాప్తంగా పది రోజుల పాటు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని అక్కడి అధికారులు బుధవారం (మార్చి 24) వెల్లడించారు. ఏప్రిల్ 4 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని తెలిపారు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించారు. ఇప్పటికే బీడ్ జిల్లాలోనూ పది రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు.. మహారాష్ట్రలో కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. నుంచి తమ రాష్ట్రానికి వచ్చే వారు తప్పనిసరిగా కొవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ చూపెట్టాలని అధికారులు నిర్దేశిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక ఈ తరహా ఆదేశాలు జారీ చేయగా.. తాజాగా గుజరాత్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాన్నే ప్రకటించింది. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే మహారాష్ట్రతో సరిహద్దును కలిగి ఉన్న జిల్లాలను అప్రమత్తం చేసింది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3riTnJG
No comments:
Post a Comment