
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విషాదం చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న సమయంలో గుండెపోటు రావడంతో.. కన్నుమూశారు. రాజ్యసభ సభ్యుడు మహ్మద్ జాన్ (72).. మంగళవారం సాయంత్రం.. రాణిపేటలోని మసీదు వీధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఈలోగానే ఛాతిలో నొప్పిగా ఉందని అనుచరులకు చెప్పారు. దీంతో వారు హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. కానీ ఈలోపే ఆయన కన్నుమూశారు. రాణిపేట నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే తరఫున పోటీ చేస్తున్న ఎస్‌ఎం సుగుమర్ తరఫున మహ్మద్ జాన్ ప్రచారం నిర్వహిస్తున్నారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జాన్.. డీఎంకే అభ్యర్థి ఆర్.గాంధీని ఓడించారు. జయలలిత ప్రభుత్వంలో బీసీ, మైనార్టీల సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన పని చేశారు. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు అనుకూలంగా రాజ్యసభలో మహ్మద్ జాన్ ఓటేశారు. దీంతో ఆయనకు వ్యతిరేకంగా నియోజకవర్గంలోని ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక జమాత్‌లో పదవి నుంచి ఆయన తప్పించారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3fkMFRp
No comments:
Post a Comment