Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 29 March 2021

లాక్‌డౌన్‌కు సిద్ధమైన మహా సీఎం.. బీజేపీతో గొంతుకలిపిన ఎన్‌సీపీ!

కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో మరోసారి లాక్‌డౌన్ అమలుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీ.. ఆందోళనకు దిగుతామని హెచ్చరించింది. ఇక, సంకీర్ణ కూటమిలోని ఎన్‌సీపీ కూడా లాక్‌డౌన్‌ విధించడానికి వ్యతిరేకంగా ఉన్నట్టు తెలుస్తోంది. లాక్‌డౌన్‌పై ఏప్రిల్ 2 తర్వాత జరిగే సమీక్షలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా.. లాక్‌డౌన్ ప్లాన్‌ను రాజకీయ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు ఇబ్బందులకు గురవుతారని ఆందోళన చెందుతున్నారు. అయితే, నిపుణులు మాత్రం వ్యాపార, వాణిజ్య ఆంక్షలకు అనుకూలంగా ఉన్నారు. ‘క్యాబినెట్‌లో చాలా మంది సహచరులు లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తున్నారు.. తొలిసారి లాక్‌డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. పెద్ద సంఖ్యలో నిరుద్యోగులుగా మారారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది’ అని ఎన్‌సీపీ అధికార ప్రతినిధి, మంత్రి నవాబ్ మాలిక్ అన్నారు. ఈ అంశాన్ని శివసేన పట్టించుకోవడం లేదు.. కానీ, ప్రతిపక్షంతో ఎన్‌సీపీ గొంతు కలిపింది. వారాంతంలో ప్రజారోగ్య అధికారులు, రాష్ట్ర కోవిడ్ -19 టాస్క్‌ఫోర్స్‌తో జరిగిన సమావేశంలో మరోసారి లాక్‌డౌన్ అవసరమైతే మార్గనిర్దేశం చేయడానికి ప్రామాణిక ఆపరేటింగ్ విధానం సిద్ధం చేయాలని సీఎం ఉద్ధవ్ సూచించారు. ప్రస్తుత ఆంక్షలు, నిబంధనలను ప్రజలు పాటించడం లేదని, ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరచడానికి సరిపోదని ఆయన అన్నారు. లాక్‌డౌన్ విధించినట్లయితే నిత్యావసరాలు, ఔషధాలు, వైద్య సౌకర్యాలు సహా అవసరమైన సేవలను నిర్ధారించడానికి ఎస్ఓపీ ఉండాలని ఠాక్రే చెప్పారు. ఏప్రిల్ 2 న పరిస్థితిని సమీక్షించే అవకాశం ఉందని, అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చని సీనియర్ అధికారులు తెలిపారు. గత పదిహేను రోజుల్లో మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. దాదాపు 4 లక్షల మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. మార్చి 1 నుంచి 28 వరకు 5.4 లక్షల మంది వైరస్ బారినపడ్డారు. ఇది గతేడాది సెప్టెంబరులో నమోదయిన కేసులతో సమానం. ప్రస్తుతం వారం రోజుల పాజిటివిటీ రేటు దేశ సగటు కంటే 22.78 శాతం అధికంగా ఉంది. మహారాష్ట్రలో రోజూ లక్షన్నరపైగా పరీక్షలను నిర్వహిస్తున్నారు. గత కొద్ది రోజులతో పోల్చితే సోమవారం పాజిటివ్ కేసులు కాస్త తగ్గాయి. ముందు రోజు 40వేల కేసులు నమోదుకాగా.. సోమవారం 31 వేలకు తగ్గింది. మొత్తం 31,647 కేసులు నమోదుకాగా.. 102 మంది ప్రాణాలు కోల్పోయారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3dfeUhz

No comments:

Post a Comment