
మావోయిస్టులు మరోసారి భారీ దాడికి పాల్పడ్డారు. జవాన్లతో వస్తున్న బస్సును శక్తివంతమైన ఐఈడీతో పేల్చేశారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో మంగళవారం (మార్చి 23) మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. మావోయిస్టుల దాడిలో గాయపడిన పలువురు జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దట్టమైన అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టి తిరిగొస్తున్న జవాన్లను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనలో ముగ్గురు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అమరులైనట్లు డీజీపీ డీఎం అవాస్తి తెలిపారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో మొత్తం 27 మంది గార్డ్స్ (పోలీసులు) ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని ఎయిర్‌లిఫ్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3lPe2UH
No comments:
Post a Comment