Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 23 March 2021

జలుబు చేసిందా.. అయితే మీకు కరోనా సోకదు!

లుబు చేసిందా.. అయితే, మీకు సోకే ముప్పు లేదు. జలుబుకు కారణమయ్యే రైనో వైరస్.. కొవిడ్-19 కారక వైరస్‌ను అడ్డుకుంటోంది. జలుబు చేసినప్పుడు మీ శరీరం వృద్ధి చేసుకునే రోగనిరోధక శక్తి కరోనా వైరస్‌ను సమర్థంగా అడ్డుకుంటోంది. అంటే.. జలుబు చేసినప్పుడు కరోనా సోకే అవకాశం లేదన్నమాట. తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో ఈ ఆసక్తికర విషయం వెల్లడైంది. ఆ వివరాలు.. చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్ 15 నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తోంది. నాటి నుంచి ఈ వైరస్‌పై పలు దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో.. జలుబుకు కారణమయ్యే రైనో వైరస్‌ ()పై ఓ అధ్యయనం చేసింది. సాధారణ జలుబుకు కారణమయ్యే రైనో వైరస్‌.. కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవడంతో పాటు కొంతవరకు రక్షణ కల్పిస్తున్నట్లు ఈ పరిశోధనలో తేలింది. అదెలా జరుగుతోంది..? మానవుల్లో సాధారణ జలుబుకు కారణం ‘రైనో వైరస్’. రైనో వైరస్‌లో అనేక రకాలున్నాయి. మానవుడిలో జలుబు ఇన్‌ఫెక్షన్లకు దాదాపు 40 శాతం ఈ రైనో వైరస్సే కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఇలాంటి వైరస్‌లు తమ మనుగడ కోసం ఇతర స్థావరాలపై ఆధారపడుతాయి. ఇలా ఎన్నో రకాల వైరస్‌లకు మానవ శరీరం కేంద్రంగా ఉంది. మానవ శరీరంలో కొన్ని వైరస్‌లు ఇతర వైరస్‌లతో కలిసి జీవిస్తాయి. మరి కొన్ని వైరస్‌లు మాత్రం సొంతంగా తమ స్థావరాలను ఏర్పరచుకుంటాయి. ఇన్‌ఫ్లూయెంజా, రైనో వైరస్‌లు ఈ రెండో రకమైన కోవకు చెందినవే. పైగా ఇవి మానవ శరీర కణాలపై దాడి చేసి ఒంటరిగానే వాటి మనుగడ కోసం పోరాటం చేస్తాయి. అధ్యయనం సాగిందిలా.. కరోనా వైరస్‌పై రైనో వైరస్ ప్రభావాన్ని తెలుసుకునేందుకు పరిశోధన నిర్వహించిన బ్రిటన్‌ సైంటిస్టులు.. ఇందుకోసం మానవ శ్వాసకోస (Respiratory) ప్రతిరూపాన్ని ఉపయోగించారు. ఇందులో సార్స్‌-కోవ్‌-2, రైనో వైరస్ రెండింటినీ స్వేచ్ఛగా కణాలకు సోకే విధంగా వదిలిపెట్టారు. రెండు వైరస్‌లను విడుదల చేసిన సమయాలను నోట్‌ చేసుకున్నారు. అనంతరం వాటిని పరిశీలించారు. రైనో వైరస్‌ను సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ ఎదుర్కోలేకపోతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. మానవ శ్వాసకోస కణాల్లో కరోనా వైరస్‌కు కారణమయ్యే ప్రతిరూపాలను అడ్డుకోవడం కోసం రైనో వైరస్‌ రోగనిరోధక ప్రతిస్పందనలను ప్రేరేపిస్తున్నట్లు గుర్తించామని ఈ పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసర్‌ పాబ్లో మర్సియా తెలిపారు. దీని ఆధారంగా సాధారణ జలుబు వల్ల వచ్చే రోగనిరోధక శక్తి కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో రక్షణ కల్పిస్తున్నట్లు నిర్ధారణ చేసుకున్నట్లు వివరించారు. అంటే.. వైరస్‌తో వైరస్ చేసే పోరాటంలో రైనో వైరస్ ఆధిపత్యం ప్రదర్శిస్తోందన్నమాట. ఆ రక్షణ స్వల్ప కాలమే.. జలుబు చేసినా.. మానవుడిలో దాని ప్రభావం స్పల్పకాలమే ఉంటుంది. అందువల్ల ఈ రక్షణ కొంతకాలం మాత్రమే ఉంటుందని పరిశోధకులు వివరించారు. యూరప్‌లో దశాబ్దం కిందట వచ్చిన స్వైన్‌ ఫ్లూ మహమ్మారిని అడ్డుకోవడంలో, వైరస్‌ వ్యాప్తిని తగ్గించడంలో రైనో వైరస్‌ దోహదపడినట్లు వచ్చిన అధ్యయనాల గురించి కూడా పరిశోధకులు ఉదహరించారు. ‘కరోనా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ నిర్మూలనలో రైనో వైరస్‌ సమర్థంగా దోహదపడుతుంది.. కానీ, కరోనా మహమ్మారి నిర్మూలనకు ఇదే పూర్తి పరిష్కారం కాదు. జలుబు తగ్గిన కొన్ని రోజులకే వాటి వల్ల వచ్చిన రోగనిరోధకత తగ్గిపోతుంది. అందువల్ల రైనో వైరస్‌ వల్ల కలిగే రక్షణ సుదీర్ఘకాలం ఉండదు’ అని పరిశోధకులు పేర్కొన్నారు. Must Read: ★ ★ ★


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/31aPaxc

No comments:

Post a Comment