Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Wednesday, 24 March 2021

భర్త ఫ్రెండ్‌తో నిర్మానుష్య ప్రదేశానికి భార్య.! చివరికి..

ముప్పై ఏళ్ల యువతి నిర్మానుష్య ప్రదేశంలోని ఓ బావిలో శవమై తేలింది. రెండు వారాల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను టెక్స్‌టైల్ కంపెనీలో పనిచేసే యువతిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫ్రెండ్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడే ఆమెను అమానుషంగా హత్య చేసి బావిలో పడేసినట్లు తేలింది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. చెంగల్పట్టు జిల్లా కోవిల్‌బాక్కం ప్రాంతానికి చెందిన చంద్ర(30) అనే యువతికి అదే ప్రాంతానికి చెందిన మణికందన్‌తో వివాహమైంది. భార్యభర్తల నడుమ తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఆమెకు భర్త స్నేహితుడు దినేష్ బాబుతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. కొద్దిరోజుల కిందట ఫ్రెండ్ భార్యను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన దినేష్.. ఏకాంతంగా గడిపేందుకు ప్రయత్నించాడు. అందుకు ఆమె నిరాకరించింది. ఆరుబయట అలా చేయడం బాగోదని ఆమె ఒప్పుకోకపోవడంతో ఆగ్రహం చెందిన దినేష్ దారుణానికి పాల్పడ్డాడు. తన కోరిక తీర్చలేదన్న కోపంతో ఆమెను బండరాయితో మోది కిరాతకంగా హతమార్చాడు. అనంతరం శవాన్ని బావిలో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. గత నెలలో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె ధరించిన టెక్స్‌టైల్ కంపెనీ యూనిఫాం ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. ప్రియుడే ఆమెను హతమార్చినట్లు తేల్చారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/31hQ3UN

No comments:

Post a Comment