Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Friday, 26 March 2021

మా ప్రజలకంటే విదేశాలకే ఎక్కువ టీకాలు పంపాం.. ఐరాసలో భారత్ ప్రకటన

తమ దేశ ప్రజలకు వినియోగించిన టీకాల కంటే ఎక్కువగానే విదేశాలకు అందజేసినట్టు ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు భారత్ తెలియజేసింది. ఈ సందర్భంగా టీకా జాతీయవాదం ప్రదర్శిస్తోన్న దేశాలను భారత్ సుతిమెత్తగా హెచ్చరించింది. వ్యాక్సిన్‌ల అసమానత కరోనా వైరస్‌ను నియంత్రించాలనే ప్రపంచ నిర్ణయాన్ని ఓడిస్తుందని పేర్కొంది. ఈ అసమానత పేద దేశాలను ఎక్కువగా ప్రభావితం చేస్తుందని ఈ మేరకు ఐరాసలో భారత శాశ్వత డిప్యూటీ ప్రతినిధి కే నాగరాజ్ నాయుడు వ్యాఖ్యానించారు. శుక్రవారం జరిగిన ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉండగా, 2021 ఏడాది ప్రారంభంలో ప్రపంచ శాస్త్రీయ సమాజం కృషితో పలు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ‘టీకా సవాల్ పరిష్కారమయ్యింది.. ప్రస్తుతం వ్యాక్సిన్ అందుబాటు, ప్రాపకం, స్థోమత, పంపిణీ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.. ఈ విషయంలో ప్రపంచ సహకారం అంతంత మాత్రంగానే ఉంది.. దీని ప్రభావం పేద దేశాలపై ఎక్కువగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. కోవిడ్-19 వ్యతిరేకంగా ప్రపంచం చేస్తున్న పోరాటానికి భారత్ ముందుందని అన్నారు. రాబోయే ఆరు నెలల్లో భారత్‌లోని 30 కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లుకు టీకా అందజేయడమేకాదు, 70కిపైగా దేశాలకు అందజేయనుంది అని నాగరాజ్ నాయుడు తెలిపారు. ఇప్పటి వరకు దేశ ప్రజలకు ఇచ్చిన టీకాల కంటే ఎక్కువగానే విదేశాలకు పంపిణీ చేశామని గుర్తుచేశారు. దేశీయంగా రూపొందించిన కొవాగ్జిన్, ఆస్ట్రాజెన్‌కా-ఆక్స్‌ఫర్డ్ అభివృద్ధిచేసిన కోవిషీల్డ్ టీకాలను అత్యవసర వినియోగం కింద అందుబాటులోకి తీసుకొచ్చామని, మరో 30 వరకు వ్యాక్సిన్‌లు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. సురక్షితమైన, సమర్ధవంతమైన వ్యాక్సిన్లు పొలిటికల్ డిక్లరేషన్ ప్రకారం.. సురక్షితమైన, సమర్థవంతమైన కోవిడ్ వ్యాక్సిన్లు అందరికీ అందుబాటులోకి తేవడం ద్వారా మహమ్మారిని అంతం చేయడానికి దోహదపడుతుంది. అలాగే, అంతర్జాతీయ ఒప్పందాలు, కార్యక్రమాలు ఉన్నప్పటికీ, కోవిడ్ వ్యాక్సిన్ల పంపిణీలో ప్రపంచవ్యాప్తంగా అసమానత ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘పలు దేశాలకు ఇంకా కోవిడ్-19 వ్యాక్సిన్లు అందుబాటులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.. ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలో వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీని పెంచడానికి ప్రపంచ సంఘీభావం, బహుళ సహకారం అవసరాన్ని నొక్కిచెప్పింది’ అని పేర్కొంది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3suusEq

No comments:

Post a Comment