Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Friday, 26 March 2021

మోదీ పర్యటనపై నిరసన.. బంగ్లాదేశ్ పోలీసుల కాల్పుల్లో నలుగురి మృతి

భారత ప్రధాని పర్యటనకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో కొంత మంది చేపట్టిన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. బంగ్లా పోలీసుల కాల్పుల్లో నలుగురు పౌరులు మృతి చెందారు. బంగ్లాదేశ్‌లోని ప్రముఖ నగరాల్లో ఒకటైన చిట్టగాంగ్‌లో శుక్రవారం (మార్చి 26) సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. మోదీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. మోదీ పర్యటనకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో రెండు రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. నిరసనలతో బంగ్లా రాజధాని ఢాకా అట్టుడుకుతోంది. పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించి నిరసనకారులను అడ్డుకుంటున్నారు. బంగ్లా స్వాతంత్య్ర స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ప్రధాని మోదీ వచ్చారు. రెండు రోజుల పాటు బంగ్లాలో పర్యటించనున్నారు. 10 రోజులుగా నిర్వహిస్తున్న 50వ స్వాతంత్య్ర దినోత్సవ ముగింపు వేడుకల్లో మోదీ పాల్గొన్నారు. ఢాకాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఇప్పటికే శ్రీలంక, మాల్దీవుల దేశాధినేతలు బంగ్లా స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. బంగ్లాదేశ్ 1971లో పాకిస్థాన్ నుంచి స్వాతంత్య్రం పొందింది. బంగ్లా స్వాతంత్య్రం పొందింది అనేకంటే.. భారత్ ఆ దేశాన్ని పాక్ నుంచి విముక్తి చేయించింది అనడం సబబు. నాడు బంగ్లా స్వాతంత్య్రం కోసం గొంతెత్తిన వారిపై పాక్ సైన్యం అత్యంత క్రూరంగా వ్యవహరించింది. భారత్ అండతోనే ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రాంతం పాక్ నుంచి విముక్తి పొందింది. బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం పోరాడిన షేక్ ముజిబూర్ రెహ్మాన్‌ను ఆ దేశ పౌరులు ‘బంగ్లాదేశ్ పితామహుడి’గా కీర్తిస్తారు. బంగ్లా ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా తండ్రే ముజిబూర్ రెహ్మాన్. ప్రస్తుతం బంగ్లాదేశ్ స్వర్ణోత్సవ వేడుకలతో పాటు ముజిబూర్ రెహ్మాన్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. 2020 సంవత్సరానికి గాను గాంధీ శాంతి పురస్కారానికి షేక్ ముజిబూర్ రెహ్మాన్‌ను ఎంపిక చేశారు. బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా రెహ్మా్న్ రెండో కుమార్తె షేక్ రెహానాకు ఈ పురస్కారాన్ని ప్రధాని మోదీ స్వయంగా అందజేశారు. మోదీ పర్యటనపై వ్యతిరేకత ఎందుకు? నరేంద్ర మోదీని హిందుత్వవాదిగా అభివర్ణిస్తున్న బంగ్లాదేశ్‌కు చెందిన ఓ వర్గం ఆయన పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బీజేపీ ప్రభుత్వం భారత్‌లో ముస్లింలను అణచివేస్తోందని ఆరోపిస్తోంది. ఆరెస్సెస్ మూలాలున్న మోదీ.. ముస్లింల వ్యతిరేకి అని మండిపడుతోంది. బంగ్లాదేశ్‌లోని పలు నగరాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అధికార పార్టీ కార్యకర్తలతో పాటు మరో వర్గం వారిని అడ్డుకుంటోంది. దీంతో పలు నగరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శుక్రవారం మధ్యాహ్నం ఢాకాలోని ప్రముఖ మసీదు వద్ద మత ప్రార్థనల సందర్భంగా పెద్ద ఎత్తున గుమిగూడిన ఓ వర్గానికి చెందిన వారు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసులు రబ్బర్ బుల్లెట్ల వర్షం కురిపించి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులు పోలీసులపై దాడులు చేశారు. Also Read: ✦ ✦ ✦


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3crQ4fj

No comments:

Post a Comment