
బీహార్ అసెంబ్లీలో హైడ్రామా నెలకొంది. బిహార్ ప్రభుత్వం మంగళవారం (మార్చి 23) సభలో ప్రవేశపెట్టిన పోలీస్ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. విపక్ష సభ్యుల ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. విపక్షానికి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు గాయాలతో రక్తమోడుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నితీశ్ కుమార్ ప్రభుత్వం పోలీసులతో తమపై దాడి చేయించిందని విపక్ష ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఆందోళనలతో పాట్నా నగరం అట్టుడికింది. సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్, మరికొంత మంది ముఖ్య నేతలతో కలిసి ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ పాట్నాలో ఆందోళన నిర్వహించారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ అరెస్టులతో ఆర్జేడీ కార్యకర్తలు విధ్వంసానికి దిగారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. మునుపటి బీహార్‌ను గుర్తుకుతెచ్చారు. స్పీకర్‌ను అడ్డుకున్న మహిళా ఎమ్మెల్యేలు విపక్షానికి చెందిన మహిళా ఎమ్మెల్యేలు స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా చాంబర్ ముందు బైఠాయించారు. ఆయణ్ని తన చాంబర్ నుంచి బయటకు రాకుండా చేశారు. దీంతో మహిళా పోలీసులు వచ్చి వారిని భవనం బయటకు లాగేశారు. పోలీసులు తమపై దాడి చేశారని పలువురు ఎమ్మెల్యేలు ఆరోపించారు. పోలీస్ బిల్లులో ఏముంది? పోలీసులకు మరిన్ని అధికారాలను కల్పిస్తూ నితీశ్ కుమార్ ప్రభుత్వం ‘బిహార్ స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీస్ బిల్ 2021’కు రూపకల్పన చేసింది. ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 3 రోజుల కిందట జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆర్‌జేడీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బిల్లు ప్రతులను చింపి నిరసన వ్యక్తం చేశారు. మంత్రి బిజేంద్ర యాదవ్ మంగళవారం ఉదయం ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న ఆర్జేడీ సభ్యులు సభ ప్రారంభం కాగానే ఆందోళనకు దిగారు. సభకు పలుమార్లు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా.. సభను నాలుగు సార్లు వాయిదా వేశారు. సభకు అంతరాయం కలిగిస్తున్న ప్రతిపక్ష సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. మార్షల్స్ వారిని అసెంబ్లీ భవనం బయటకు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పరిస్థితి అదుపు రాకపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. పోలీసులకు, ఆర్జేడీ-కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి ఎమ్మెల్యేలకు మధ్య ఘర్షణ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని ఆర్జేడీ నేతలు విమర్శించారు. నితీశ్ ప్రభుత్వం రౌడీయిజానికి ఇది పరాకాష్ట అని మండిపడ్డారు. ఎస్పీ తనను ఛాతీపై తన్నాడని ఎమ్మెల్యే సత్యేంద్ర కుమార్ ఆరోపించారు. ఈ చట్టం పోలీసులకు.. వారెంట్ లేకుండానే విచారణ చేయడానికి అవకాశం కల్పిస్తుందని ఆర్జేడీ నేతలు చెబుతున్నారు. తద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయస్థానాలకు, మేజిస్ట్రేట్‌లకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే భయం లేకుండా పోలీసులు ఎవరినైనా అరెస్టు చేసే అవకాశం ఈ చట్టం ద్వారా దఖలు పడుతోందని చెబుతున్నారు. Also Read: ✦ ✦
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Qz9PJl
No comments:
Post a Comment