
ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మిట్టమధ్యాహ్నం ఎండలు మండుతున్నాయి. ప్రధాన నగరాలన్నింటిలో ఉష్ణోగ్రతల పెరుగుదలతో జనం ఇక్కట్లు పడుతున్నారు. కానీ, హిమాలయ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఇక్కడ వర్షం కురుస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో వివిధ ప్రాంతాల నుంచి చల్లదనం కోసం వచ్చిన పర్యాటకులు మరింత అనుభూతి చెందుతున్నారు. లాహౌల్ స్పితి, కులూ, సిమ్లా తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మనాలిలో 30 మి.మీ. వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో హిమపాతం సంభవించింది. మరో రెండు రోజుల పాటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కులూ, ప్రాంతంలో వాతావరణాన్ని బాగా ఆస్వాదిస్తున్నట్లు ఢిల్లీ నుంచి వచ్చిన ఓ పర్యాటకుడు తెలిపాడు. ఢిల్లీలో ఉక్కపోతతో ఇబ్బంది పడుతుంటే.. ఇక్కడ మాత్రం చలి వణికిస్తోందని అతడు పేర్కొన్నాడు. మనాలిలో ఓ చోట వర్షం కురుస్తుండగా.. పర్యాటకులు సరికొత్త అనుభూతి చెందుతున్న దృశ్యాలను వీడియోలో వీక్షించవచ్చు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3rcuqj7
No comments:
Post a Comment