మేఘాలయకు చెందిన ఓ ఎమ్మెల్యే కరోనాతో శుక్రవారం కన్నుమూశారు. స్వతంత్ర ఎమ్మెల్యే సింటార్ క్లాస్‌కు మంగళవారమే ఆయనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. దీంతో ఆయన హోంఐసోలేషన్‌లోనే చికిత్స తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆరోగ్యం శుక్రవారం విషమించడంతో చికిత్స పొందుతూ మావంగాప్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఎమ్మెల్యే సింటార్ క్లాస్ సున్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోలేదని తెలుస్తోంది. ఆయనతోపాటు మేఘాలయలోని మరో ఏడుగురు ఎమ్మెల్యేలు టీకా వేసుకోలేదు. పబ్లిక్ హెల్త్ విభాగంలో చీఫ్ ఇంజినీరింగ్‌గా పదవీవిరమణ చేసి 2016లో రాజకీయాల్లోకి వచ్చిన సింటార్ క్లాస్.. 2018 మేఘాలయ ఎన్నికల్లో మావ్‌ఫలంగ్ అసెంబ్లీ స్థానం నుంచి స్వంత్రత అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. మేఘాలయ అసెంబ్లీ ఎన్విరాన్‌మెంట్ కమిటీకి సున్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సున్ కుమారుడు యూజీనిసన్ లింగ్డో జాతీయస్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ఎమ్మెల్యే సింటార్ క్లాస్ సున్ మృతికి మేఘాలయ ముఖ్యమంత్రి కొనరాడ్ సంగ్మా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘మావ్‌ఫలంగ్ ఎమ్మెల్యే సింటార్ క్లాస్ సున్ హఠాన్మరణం తీవ్ర విచారకరం.. ఆయన మరణవార్త తెలిసి నాకు మాటలు రాలేదు.. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి సేవకోసమే పాటుపడ్డారు.. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని సీఎం ఓ ప్రకటనలో తెలిపారు. మేఘాలయ అసెంబ్లీలో 2018 నుంచి సున్‌తో కలిపి ఇప్పటి వరకు ఐదుగురు ఎమ్మెల్యేలు చనిపోయారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3hnSsFQ
0 Comments