భార్యను నరికి తలతో వీధుల్లో హంతకుడు.. దేశాన్ని కుదిపేస్తున్న వైరల్ వీడియో

భార్య ప్రవర్తన సక్రమంగా లేదని అనుమానించిన ఓ యువకుడు.. ఆమె తల నరికి వీధిలో ప్రదర్శించిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ భయంకర ఘటన ఇరాన్‌లో చోటుచేసుకోగా.. ఇరానియన్లను తీవ్రంగా కదిలించింది. నైరుతి నగరం అహ్వాజ్‌లో మోనా హీదారీ (17) అనే యువతిని ఆమె భర్త, బావ హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నట్లు ఆ దేశా మీడియా ఐఎస్ఎన్ఏ పేర్కొంది. నిందితుల రహస్య స్థావరంపై దాడి చేసిన పోలీసులు.. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారని తెలిపింది. కాగా, ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఇరాన్ మహిళా వ్యవహారాల ఉపాధ్యక్షురాలు ఎన్సీ ఖజాలీ.. పార్లమెంట్‌ను అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి ఇటువంటి నేరాలను అరికట్టేలా చర్యలు, ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. ఇరాన్ పత్రికలు, సోషల్ మీడియాలో ఈ హత్యోదంతంపై దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ఆవేశంతో రగిలిపోతున్న నెటిజన్లు.. సామాజిక, చట్టపరమైన సంస్కరణలను తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ‘ఓ నరరూప రాక్షసుడు శిరచ్ఛేదం చేసి, తలను పట్టుకుని వీధుల్లో గర్వంగా తిరుగుతున్నాడు.. ఇలాంటి విషాదాన్ని మనం ఎలా అంగీకరించగలం? మహిళల హత్యలు మళ్లీ జరగకుండా మనం చర్య తీసుకోవాలి’ ’ అని ఇరాన్ సామాజిక దినపత్రిక సజాండేగి పేర్కొంది. ఇరాన్‌కు చెందిన ప్రముఖ స్త్రీవాది తహ్‌మైనేహ్ మిలానీ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. వినాశకరమైన అజ్ఞానానికి మోనా బలైపోయింది.. ఈ నేరానికి మనమంతా బాధ్యులం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. హిదారీ ఘటనతో దేశంలోని మహిళలను గృహహింస నుంచి రక్షించేలా చట్టాలను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, ప్రస్తుతం 13గా ఉన్న వివాహ వయసును కూడా పెంచాలని కోరుతున్నారు. ఇరాన్ మీడియా ప్రకారం.. హతురాలు మోనా హీదారీకి 12 ఏళ్ల వయసులో వివాహం జరిగింది. ఆమె హత్యకు గురయ్యేనాటికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. చట్టంలో లోసుగుల వల్లే పరువు హత్యలు జరుగుతున్నాయని అన్నారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/MYlif6D

Post a Comment

0 Comments