Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Friday, 19 July 2019

చందమామ అందిన రోజు.. నేటికి 50 ఏళ్లు

జులై 20, 1969న మానవ జాతి చరిత్రలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. అప్పటివరకు భూగోళానికే పరిమితమైన మనిషి తన ప్రస్థానాన్ని మరో ప్రపంచంలో ప్రారంభించాడు. తొలిసారిగా చందమామను అందుకున్నాడు. లక్షల మంది శ్రమ, కోట్లాది మంది ఆశలు, ఆకాంక్షలు నెరవేరిన శుభదినం. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన వ్యోమనౌక ద్వారా వ్యోమగాములు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, మైకెల్ కొల్లిన్స్, ఎడ్విన్ ఇ అల్డ్రిన్‌ను చంద్రుడిపైకి పంపింది. వీరిలో మొదటిగా చంద్రుడిపై కాలు మోపి రికార్డులకు ఎక్కాడు. ఆర్మ్‌స్ట్రాంగ్ అడుగుపెట్టిన 20 నిమిషాల తర్వాత.. అల్డ్రిన్ చంద్రుడిపై కాలు మోపాడు. వాళ్లు దాదాపు 21 గంటలు చంద్ర మండలంపై గడిపారు. ఇక, చంద్రుడిపై ఏముందో తెలుసుకోడానికి తొలిసారిగా ప్రయోగాలు చేసిన దేశం.. రష్యా. సోవియట్ 1957లో తొలి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్‌ను ప్రయోగించింది. 1959లో లూనా-2 ద్వారా చంద్రుడిపై తొలిసారి ఉపగ్రహాన్ని పంపింది. ఇది విజయవంతం కావడంతో 1961 ఏప్రిల్ 21న ఇద్దరు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపి చరిత్ర సృష్టించింది. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న అమెరికా నేరుగా వ్యోమగాములను పంపాలనే సాహోసేత నిర్ణయం తీసుకుంది. చంద్రుడిపైకి మానవ సహిత యాత్ర కోసం నాసా అపోలో మిషన్ చేపట్టింది. దీనికోసం దాదాపు 2,500 కోట్ల డాలర్లు ఖర్చుచేయగా, దాదాపు 4 లక్షల మంది నిపుణులు పనిచేశారు. 1969 జులై 16న జాన్ ఎఫ్ కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి శాటర్న్-5 అనే రాకెట్ ద్వారా అపోలో-11 వ్యోమనౌక అంతరిక్షంలోకి పంపారు. 110 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జులై 20న అపోలో-11 చంద్రుడిపై దిగింది. వ్యోమగాములు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, మైకేల్ కొలిన్స్ లూనార్ మాడ్యూల్‌లో చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టారు. మరో వ్యోమగామి బజ్ ఆల్డ్రిన్ కమాండ్ మాడ్యూల్‌లో ఉండి వారిని తిరిగి సురక్షితంగా భూమికి చేర్చడానికి సహకరించారు. లూనార్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలంపై ఉన్న సీ ఆఫ్ ట్రాన్‌క్విలిటీ అనే ప్రాంతంలో దిగింది. ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై దిగిన 20 నిమిషాల తర్వాత కొలిన్స్ అడుగుపెట్టాడు. ‘ఇది మనిషిగా ఒక చిన్న అడుగు.. మానవాళికి మాత్రం భారీ గెంతు’ అని ఈ సందర్భంగా ఆర్మ్‌స్ట్రాంగ్ గట్టిగా అరిచారు. చంద్రుడి ఉపరితలంపై దాదాపు రెండు గంటలు గడిపారు. అక్కడ అమెరికా జెండాను నాటారు. చంద్ర శిలలు, మట్టి నమూనాలను సేకరించి, ఫొటోలు తీసుకొని, ప్రయోగ పరికరాలను అక్కడ వదిలేసి తిరుగు ప్రయాణమయ్యారు. అక్కడ నుంచి బయలుదేరిన నాలుగు రోజుల తర్వాత జులై 24న పసిఫిక్ మహాసముద్రంలోకి అపోలో-11 సురక్షితంగా దిగింది. వ్యోమగాములు చంద్రుడి ఉపరితలం నుంచి సేకరించిన దాదాపు 21.5 కిలోల రాళ్లు, మట్టి నమూనాలను పరిశోధనల కోసం వివిధదేశాలకు నాసా పంపిణీ చేసింది. ఆస్ట్రోనాట్లు చంద్రుడిపై దిగడాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయగా, ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల మంది దీన్ని వీక్షించినట్లు అంచనా. నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ టెలిఫోన్-రేడియో ట్రాన్స్‌మిషన్ ద్వారా వ్యోమగాములతో మాట్లాడారు. వైట్‌హౌస్ నుం చి చేసిన చారిత్రక ఫోన్‌కాల్ ఇది అని అభివర్ణించారు. అప్పట్లో వాళ్లు ఉపయోగించిన గైడెన్స్ సిస్టమ్ కేవలం 64 కేబీ మెమరీ ర్యామ్‌తోనే పనిచేయడం గమనార్హం. అంటే, మన స్మార్ట్ ఫోన్‌లోని ఉన్న మెమరీ కంటే చాలా తక్కువ. అప్పుడప్పుడే టెక్నాలజీ ఓనమాలు నేర్చుకుంటున్న సమయంలో నాసా ఏకంగా మనిషిని చంద్ర మండలంపై పంపిందంటే సాధారణ విషయం కాదు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2xZlBjs

No comments:

Post a Comment