అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుని 15సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత భార్యపై అనుమానం పెంచుకున్న వ్యక్తి ఆమెను దారుణంగా చంపేసిన ఘటన జిల్లా గోపాలపురం మండలం రాంపాలెంలో చోటుచేసుకుంది. కూతురిని కాపాడుకునేందుకు అడ్డొచ్చిన అత్తను కూడా కత్తితో పొడవడంతో ఆమె కూడా ప్రాణాలు కోల్పోయింది. రాంపాలెం గ్రామానికి చెందిన కాంతారావు, దొండపూడికి చెందిన లక్ష్మికి 15ఏళ్ల క్రితం వివాహమైంది. భార్యపై అనుమానం పెంచుకున్న కాంతారావు భార్యను ఆమెను తరుచూ వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మూడుసార్లు ఆత్మహత్య చేసుకునేందుకు కూడా ప్రయత్నించాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన లక్ష్మి పిల్లలతో కలిసి దొండపూడిలోని పుట్టింటికి వెళ్లిపోయి నాలుగు నెలలుగా అక్కడే ఉంటోంది. భార్యను తనతో రావాలని కాంతారావు చాలాసార్లు కోరినా ఆమె నిరాకరించింది. Also Read: ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి మద్యం మత్తులో అత్తింటికి వచ్చిన కాంతారావు భార్యను తనతో రావాలని కోరాడు. దీనికి ఆమె నిరాకరించడంతో గొడవ పెట్టుకున్నాడు. అత్త పుష్పవతి కూడా అల్లుడిని దుర్భాషలాడింది. దీంతో ఆగ్రహం చెందిన కాంతారావు తనతో తెచ్చుకున్న కత్తితో భార్య గొంతు కోశాడు. కూతురిని రక్షించుకునేందుకు ప్రయత్నించిన పుష్పవతి పైనా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో లక్ష్మి, పుష్పవతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతడిని అడ్డుకునేందుకు వచ్చిన బావమరిదిపైనా కత్తితో దాడి చేశాడు. అనంతరం పెద్ద కేకలు వేస్తూ కాంతారావు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో స్థానికులు అతడిపై రాళ్లతో దాడి చేసి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. జంట హత్యలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2YcQ24y
No comments:
Post a Comment