అతిశభ్రత... రోజుకు 10సార్లు స్నానం.. భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త

ఆమెకు ఏదైనా శుభ్రంగా ఉండాలని ఆరాటం. ఏ పనిచేసినా నీట్‌గా ఉండాలని, ఇంట్లో వాళ్లు కూడా తనలాగే ఉండాలని సతాయించేంది. బయటి వ్యక్తులు ఎవరినైనా ముట్టుకున్నా స్నానం చేసేది. కరెన్సీ నోట్లను కూడా కడిగి ఆరబెట్టిన తర్వాతే ఖర్చు చేసేది. భార్య పాటించే అతిశుభ్రతను భరించలేక ఆ భర్త ఆమెను కిరాతకంగా చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని మైసూర్‌లో జరిగింది. Also Read: మండహళ్లికి చెందిన శాంతమూర్తి (40), పుట్టమణి (38)కి 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి 12, 7 ఏళ్ల వయసున్న పిల్లలున్నారు. మడికి అతి ప్రాధాన్యమిచ్చే పుట్టమణి భర్త బయటి నుంచి ఇంటికి వస్తే స్నానం చేశాకే లోనికి అనుమతించేది. ఇలా అతడు రోజుకు 10సార్లు స్నానం చేయాల్సి వచ్చేది. పిల్లల స్కూల్ నుంచి వచ్చాక బ్యాగుల్ని కడిగి ఆరబెట్టేది. శాంతమూర్తికి భార్య తీరు విసుగు పుట్టించినా కొన్నాళ్ల పాటు ఎలాగోలా భరించాడు. ఇటీవల ఆమె పద్ధతి శ్రుతిమించడంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. Also Read: ఈ క్రమంలో భార్యభర్తలిద్దరూ మంగళవారం పొలానికి వెళ్లారు. అక్కడ కూడా పుట్టమణి శుభ్రత విషయంలో భర్తను విసిగించింది. దీంతో ఆగ్రహానికి లోనైన శాంతమూర్తి కొడవలితో ఆమెను నరికేశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. తర్వాత ఇంటికి వెళ్లిన శాంతమూర్తి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం ఇంటికొచ్చిన పిల్లలు తండ్రి ఫ్యాన్‌కు వేలాడుతుండటాన్ని చూసి స్థానికులకు చెప్పారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పుట్టమణి ఏమైందో తెలుసుకునేందుకు గాలించగా పొలంగా విగతజీవిగా కనిపించింది. దీంతో పోలీసులు ఇద్దరి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. మొత్తానికి అతిశుభ్రత దంపతుల ప్రాణాలను బలి తీసుకోగా.. వారి ఇద్దరి పిల్లలను అనాథలుగా మార్చింది. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/39N6Wc8

Post a Comment

0 Comments